Balakrishna: సోషల్‌ మెసేజ్‌ కోసం తమిళ దర్శకుడిని తీసుకొస్తున్నారా… బాలయ్యా?

మన దర్శకుల గురించి తక్కువ చేసి మాట్లాడటం కాదు కానీ… సందేశాత్మక చిత్రాలు అంటే తమిళ దర్శకులు అనే మాట ఒకటి చాలా ఏళ్ల క్రితం నుండి సౌత్‌ సినిమాల్లో ఉంది. అక్కడి దర్శకులు రాసిన కథలు కానీ, చేసిన సినిమాలు కానీ ఆ దిశగా ఎక్కువగా ఉంటాయి అని అంటుంటారు. ఇప్పుడు ఆ ఆలోచనతోనో, లేక ఇంకే కారణం చేతనో కానీ నందమూరి బాలకృష్ణ ఓ తమిళ దర్శకుణ్ని తెలుగులోకి మళ్లీ తీసుకొస్తున్నారు అంటున్నారు.

బాబి సినిమాతో ప్రస్తుతం బాలయ్య బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్‌ ప్రారంభించుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాతో బాలయ్య ఏ సినిమా చేస్తారు అనే ప్రశ్నకు రకరకాల సమాధానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది దర్శకుల పేర్లు బయటకు రాగా, ఇప్పుడు మూడో దర్శకుడు పేరు వచ్చింది. ఆ కొత్త దర్శకుడే మురుగదాస్‌. తమిళంలో, తెలుగులో సందేశాత్మక చిత్రాలు తీసిన ట్రాక్‌ రికార్డు ఆయనది.

కమర్షియల్‌ అంశాలకు, సందేశం జోడించి సినిమాలు చేసి మెప్పిస్తుంటారాయన. అయితే ఇటీవల కాలంలో ఆయన నుండి వచ్చిన సినిమాలు సరైన విజయం అందుకోవడం లేదు. కానీ ఆయన రోజు వచ్చిందంటే… కొట్టే గెలుపు శబ్దం మామూలుగా ఉండదు అంటుంటారు. ఇప్పుడు బాలయ్యతో కూడా అలాంటి ఓ మాస్‌ సందేశాత్మక చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. కథ బేసిక్‌ లైన్‌ విన్న బాలయ్య పూర్తి కథ సిద్ధం చేయమన్నారని టాక్‌.

మురుగుదాస్ ప్రస్తుతం శివ కార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాతనే బాలయ్యతో సినిమా ఉంటుందని అంటున్నారు. నిజానికి మురుగదాస్‌ నుండి 2020 తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమా ఏమీ రాలేదు. వరుసగా అగ్ర హీరోలకు కథలు చెప్పడం, అవి దాదాపు ఓకే అని సమాచారం రావడం, ఆ తర్వాత వాటి ఊసు లేకుండా పోవడం జరుగుతోంది. మరి ఇప్పుడు (Balakrishna) బాలయ్యతో సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus