ఆ డైరెక్టర్ బాలయ్య ప్రభాస్ కాంబోలో మూవీ ప్లాన్ చేశారా?

సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్ సినిమాలు రావడం ఎప్పటినుంచో ఉంది సీనియర్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి హీరోలు కూడా మల్టీ స్టార్ సినిమాలలో నటించే ప్రేక్షకులను సందడి చేశారు. అయితే మధ్యలో ఈ మల్టీ స్టార్ సినిమాలకు కాస్త బ్రేక్ పడినప్పటికీ ఇప్పుడు మరోసారి ఈ మల్టీ స్టార్ చిత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. ఇలా ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తూ ఉంటే వారి అభిమానులకు పండగే అని చెప్పాలి.

ఇలా ఇప్పటికే మల్టీ స్టార్ సినిమాలు హవా పెరిగిపోతోంది అయితే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ క్రేజీ మల్టీ స్టారర్ కాంబో రాబోతుందని సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సీనియర్ హీరో అయినటువంటి బాలకృష్ణ సైతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా ఈ ఇద్దరు హీరోలకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరినీ కలిపి ఒకే సినిమాలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఒక బాలీవుడ్ డైరెక్టర్ కు కలిగింది. ఇలా ఆలోచన రావడమే ఆలస్యం ఆ ఆలోచనను అమలుపరిచే దిశగా బాలీవుడ్ డైరెక్టర్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే బాలకృష్ణ ప్రభాస్ మల్టీ స్టార్ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నటువంటి ఆ డైరెక్టర్ త్వరలోనే ఈ ఇద్దరి హీరోలకి ఆ సినిమా కథ వినిపించడానికి సిద్ధమయ్యారట.

ఇక ఇద్దరు కూడా సినిమా కథ విన్న తర్వాత కథ నచ్చితే ఈ సూపర్ క్రేజీ కాంబో తెరపైకి రాబోతుందని సమాచారం.అయితే ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా గురించి అన్ని విషయాలు తెలియనున్నట్లు సమాచారం. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలియడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus