Balakrishna, Vasundhara: ‘అన్‌స్టాపబుల్‌’లో మరో మెస్మరైజింగ్‌ మూమెంట్‌!

‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్‌’ షోలో బాలకృష్ణ మరీ కుర్రాడిలా మారిపోతున్నాడు. వచ్చే గెస్ట్‌ ఏజ్‌లోకి ఈయన పరకాయ ప్రవేశం చేసినట్లు… వాళ్లతో సమానంగా ఎంజాయ్‌ చేస్తూ షోను నడిపిస్తున్నాడు. నాని వస్తే నానిలా మారిపోయాడు. రాజమౌళి, కీరవాణి వస్తే వాళ్ల స్థాయిలోకి వచ్చేశాడు. వచ్చే వారం షోకి గెస్ట్‌గా రానా వచ్చాడు. ఇంకేముంది రానా ఏజ్‌లోకి వచ్చేశాడు బాలయ్య. ఇక సందడి ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాలా… దబిడి దిబిడే అనిపించాడు.

ప్రోమోలో రానాను బాలయ్య బాగా ఏడిపించాడు. రానా గత జీవితం అంటూ… అతని లవ్‌ అఫైర్లు, పుకార్లు, స్నేహాలు… ఇలా ఒక్కటేంటి అన్నిరకాల అంశాల గురించి ఏకరువు పెట్టేశాడు. దీంతో రానా బిక్కమొహం వేశాడనుకోండి. కానీ దేన్నైనా స్పోర్టివ్‌గా తీసుకునే రానా మరోసారి అదరగొట్టేశాడు అని చెప్పాలి. గూగుల్‌లో రానా మీద వచ్చే వార్తలు, గాసిప్‌ల గురించి డిస్కషన్‌ అయితే భలేగా జరిగింది. ఆ తర్వాత రానా పెళ్లి గురించి బాలయ్య ఎత్తుకున్న విధానం అయితే భలే అనిపించింది.

ఆ తర్వాత బాలయ్యతో కాసేపు సరదా చేద్దాం అనుకున్నాడో ఏమో రానా ఆట మొదలుపెట్టాడు. ‘మీ భార్య వసుంధరకి ఎప్పుడైనా ఐ లవ్‌ యూ చెప్పారా?’ అని అడిగాడు రానా. దానికి బాలయ్య ‘నీకెందుకయ్యా?’ అంటూ ఓ లుక్‌ ఇచ్చాడు చూడండి. అదిరిపోయింది అనుకోండి. ఆ తర్వాత బాలయ్య ఫోన్‌ అందుకుని భార్య వసుంధరకు ఫోన్ చేసి ‘ఐ లవ్‌ యూ వసూ’ అని చెప్పేశారు. ఇంకేముంది సెట్‌లో అందరూ నవ్వులే నవ్వులు. చూసినవాళ్ల పరిస్థితీ అంతే.

అంతకుముందు రానా మరో ప్రశ్న అడిగాడు. ఇద్దరి మధ్య మాట మాట వస్తే… ముందు ‘సారీ’ ఎవరు చెబుతారు అని. దానికి బాలయ్య ఏ మాత్రం మొహమాటం లేకుండా ‘నేనే చెబుతాను’ అని చెప్పాడు. ‘‘కృష్ణుడంతటోడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు… ఈ బాలకృష్ణుడు ఎంతయ్యా’’ అంటూ ఓ డైలాగ్‌ కూడా వేశాడు బాలయ్య. ఆ తర్వాత బాలయ్య గొడుగుతో వేసిన స్టెప్‌ అయితే సూపరో సూపర్‌.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus