Balakrishna: సీనియర్ స్టార్ హీరోలలో బాలయ్య ఆ అరుదైన రికార్డ్ ను సాధిస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. ఓవర్సీస్ లో ఈ రెండు సినిమాలు వేర్వేరుగా మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సాధించాయి. ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కూడా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ కలెక్షన్లను సాధిస్తే ఓవర్సీస్ లో హ్యాటిక్ మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించిన ఘనత బాలయ్య సొంతమవుతుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఎవరూ ఈ రికార్డ్ ను సాధించలేదు.

స్టార్ హీరో బాలయ్య ఈ అరుదైన ఘనతను కచ్చితంగా సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనిల్ రావిపూడి సినిమా అంటే ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లను సాధిస్తాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అనిల్ రావిపూడి తన సినిమాలలో ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమాల స్క్రిప్ట్ ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తనకు కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే టాలెంట్ ఉన్న దర్శకులకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారు. బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో సాంగ్స్, యాక్షన్ సీన్స్, బీజీఎం స్పెషల్ గా ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాజల్, శ్రీలీల ఈ సినిమాలో నటిస్తుండగా ఆయా హీరోయిన్ల ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం.

బాలయ్య (Balakrishna) స్టైల్ కు అనుగుణంగా అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలయ్య దసరాకు బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాలి. బాలయ్య ఈ సినిమా తర్వాత 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవాలని బాలయ్య భావిస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం పలు యాడ్స్ లో నటిస్తుండగా ఈ యాడ్స్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని సమాచారం. బాలయ్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై ఫోకస్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus