Balakrishna, Ravi Teja: రవితేజ డైరెక్షన్ లో నటిస్తానన్న బాలయ్య.. కానీ?

స్టార్ హీరో బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆహా ఓటీటీలో మరే టాక్ షోకు రాని స్థాయిలో అన్ స్టాపబుల్ షోకు వ్యూస్ వస్తున్నాయి. గత నెల 31వ తేదీ నుంచి బాలయ్య హోస్ట్ గా రవితేజ గెస్ట్ గా హాజరైన అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ షోలో బాలయ్య రవితేజతో కలిసి సినిమా చేస్తానని వెల్లడించాడు. బాలయ్య రవితేజ కాంబినేషన్ లో సినిమా రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

అయితే రవితేజ డైరెక్షన్ లో బాలయ్య సినిమా రాబోతుందనే ప్రకటన ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాక్ షోలో బాలయ్య రవితేజతో “నీలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడంటగా” అని అడగగా ఆ ప్రశ్నకు సమాధానంగా రవితేజ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని నాలో డైరెక్టర్ ఉంటాడని రవితేజ కామెంట్లు చేశారు. నా సినిమా దర్శకులతో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ గురించి మాట్లాడతానని రవితేజ చెప్పుకొచ్చారు.

డైరెక్షన్ పై ఆసక్తి ఉన్నా సెట్స్ పైకి వస్తే మాత్రం నటుడిగా మాత్రమే తాను ఉంటానని డైరెక్టర్ పనిలో వేలు పెట్టనని రవితేజ అన్నారు. ప్రస్తుతం అంతా బాగా నడుస్తోందని అందువల్ల తనలో ఉన్న డైరెక్టర్ ను అలాగే దాచానని అయితే తన డైరెక్షన్ లో సినిమా మాత్రం ఉంటుందని రవితేజ పేర్కొన్నారు. తన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో తాను హీరోగా నటించనని తన కొడుకును కూడా హీరోగా పెట్టనని రవితేజ పేర్కొన్నారు.

ఆ తర్వాత బాలకృష్ణ మాత్రం రవితేజ డైరెక్షన్ లో తాను చేస్తానని కామెంట్లు చేశారు. తమ కాంబినేషన్ లో వచ్చే సినిమా మాస్ అమ్మ మొగుడిలా ఉంటుందని బాలయ్య పేర్కొన్నారు. మరి ఈ కాంబినేషన్ లో నిజంగా సినిమా పట్టాలెక్కుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రవితేజ హీరోగా వరుస ఆఫర్లతో బిజీగా ఉండటంతో ఇప్పట్లో రవితేజ డైరెక్షన్ పై ఆసక్తి చూపే అవకాశం లేదని చెప్పవచ్చు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus