Balakrishna,Gopichand Malineni: గోపీచంద్ అలాంటి కథ చెబితే బాలయ్య రిజెక్ట్ చేశారా?

అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజే 54 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ సమయానికి మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో జోరుగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే వీరసింహారెడ్డి కంటే ముందు గోపీచంద్ మలినేని మరో కథను బాలయ్యకు చెప్పారట.

24 గంటల్లో జరిగే కథను బాలయ్యతో తెరకెక్కించాలని గోపీచంద్ మలినేని భావించగా బాలయ్య మాత్రం ఆ కథను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత వీరసింహారెడ్డి ఇంటర్వెల్ ట్విస్ట్ ను చెప్పి బాలయ్యతో గోపీచంద్ మలినేని గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారు. బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా తెగ నచ్చేసింది. అయితే క్లాస్ కథలు బాలయ్యకు నచ్చవని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ షోలో వీరసింహారెడ్డి టీమ్ ఎపిసోడ్ లో ఈ విషయాలు రివీల్ అయ్యాయి.

అటు యాక్షన్ సీన్లు ఇటు ఎమోషనల్ సీన్లు బాలయ్యను ఎంతగానో మెప్పించాయి. గోపీచంద్ మలినేని తర్వాత సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. అయితే పవన్ గోపీచంద్ కాంబో మూవీ సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. వీరసింహారెడ్డి సక్సెస్ తో గోపీచంద్ మలినేనికి క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.సీనియర్ హీరోలను కూడా బాగా హ్యాండిల్ చేయగలనని గోపీచంద్ మలినేని ప్రూవ్ చేసుకున్నారు.

సినిమా సినిమాకు దర్శకునిగా గోపీచంద్ మలినేని మార్కెట్ కూడా అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.గోపీచంద్ మలినేని రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందని సమాచారం. ఒక్కో సినిమాకు గోపీచంద్ మలినేని 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికంను అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus