Balakrishna: బ్రాండ్ అంబాసిడర్ గా బాలయ్య రెమ్యునరేషన్ ఎంతంటే!

  • October 25, 2022 / 07:30 PM IST

‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’.. అన్ స్టాపబుల్ షోలో చెప్పిన ఈ మాట బాలయ్య బాబు వ్యక్తిత్వానికి చక్కగా సరిపోతుంది.. ఏదైనా కల్మషం లేకుండా ముఖం మీదే చెప్పెయ్యడం ఆయనకు అలవాటు.. ముక్కుసూటితనం, కోపిష్టి లాంటి పేర్లు ఎన్ని పెట్టినా.. ఒకసారి ఆయనతో కలిసినా, లేక ఏదైనా సినిమాలో నటించినా.. బాలయ్యది చిన్నపిల్లాడి మనస్తత్వం.. బాలయ్య భోళాశంకరుడు అని పాజిటివ్ గా చెప్తుంటారు.. ‘అఖండ’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తున్నారు.

గోపిచంద్ మలినేని దర్శకత్వలంలో, మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రానికి ‘వీర సింహా రెడ్డి – గాడ్ ఆఫ్ మాసెస్‘ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది..ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.. వచ్చే నెలలో అనిల్ రావిపూడి పిక్చర్ స్టార్ట్ కాబోతుంది..ఈ గ్యాప్ లో అన్ స్టాపబుల్ షోతో పాటు మరో కొత్త షూట్ లోనూ పాల్గొంటున్నాడు బాలయ్య.. తన 48 ఏళ్ల నటజీవితంలో నటసింహ మొట్టమొదటిసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకు కమర్షియల్ యాడ్స్ కి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సాయిప్రియ కన్ స్ట్రక్షన్స్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. రీసెంట్ గా యాడ్ షూట్ లో కూడా పాల్గొన్నారు. ఈ సంస్థ అన్ స్టాపబులో షోకి స్పెషల్ పార్ట్ నర్ గా వ్యవహరిస్తోంది.. అయితే ఈ యాడ్ కోసం బాలయ్య తీసుకున్న రెమ్యునరేషన్ గురించి.. ఆ డబ్బుతో ఆయన చేసిన మంచి పని గురించి NBK ఫ్యాన్స్ చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ టైం నటిస్తున్న ప్రకటన కోసం బాలయ్యకి అక్షరాలా 16 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేశారట.

ఆ మొత్తాన్ని నేరుగా తాను ఛైర్మన్ గా ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి ఇవ్వమని ఆయన చెప్పడంతో.. సాయిప్రియ కన్ స్ట్రక్షన్స్ వారు ఇన్ స్పైర్ అయ్యి మరో 1. కోట్లను తమ వంతు విరాళంగా అందజేశారట. ‘‘ఇంత జరిగినా కానీ దీని గురించి ఒక్క మాట కూడా మీడియాలో రాలేదు.. రానివ్వలేదు.. బాలయ్య పబ్లిసిటీ కోరుకోడు.. అదే ఆయన స్టైల్’’ అంటూ తమ అభిమాన హీరో మంచిమనసు గురించి నందమూరి ఫ్యాన్స్.. యాడ్ షూటింగ్ లో స్టైలిష్ గా కనిపిస్తున్న నటసింహం పిక్స్ షేర్ చేస్తున్నారు..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus