టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఒకవైపు వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు హిందూపురం నియోజకవర్గంలోని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. హిందూపురం నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలనే ఆలోచనతో బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉచిత వైద్య సేవలను అందించడానికి “ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం” ను ఏర్పాటు చేశారు. అతి త్వరలో బాలయ్య చేతుల మీదుగా ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభం కానుంది.
ఈ రథం ద్వారా 200 కంటే ఎక్కువగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని సమాచారం. ఈ ఆరోగ్య రథం కోసం బాలయ్య 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. ఈ ఆరోగ్య రథం ద్వారా వైద్యుల సంప్రదింపులు, గ్రామాలలో అవగాహన సదస్సులు జరగనున్నాయని సమాచారం. ఈ ఆరోగ్య రథంలో డాక్టర్, నర్స్, ఇతర వైద్య సిబ్బంది, ఫార్మసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారని బోగట్టా. చిన్నచిన్న వ్యాధులకు ఆరోగ్య రథంలోనే చికిత్స చేసి వైద్యులు మందులను అందజేస్తారు.
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే వైద్య సేవల కోసం ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఆరోగ్య రథం ద్వారా హిందూపురంలోని ఒక్కో గ్రామంలో ఒక్కో రోజు వైద్య సేవలు అందిస్తారని సమాచారం. ఆరోగ్య రథం ద్వారా హిందూపురం ప్రజలకు బెనిఫిట్ కలిగేలా బాలయ్య తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదని భావించిన బాలకృష్ణ ఈ ఆరోగ్య రథాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
బాలయ్య సేవా గుణాన్ని ఇతర హీరోల అభిమానులు సైతం మెచ్చుకుంటున్నారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?