అభిమానులని కలవర పెడుతున్న మేటర్ ఇదే..!

  • February 16, 2021 / 05:09 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఇప్పుడు వకీల్ సాబ్ ని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని ఆశగా ఉన్నారు. అంతేకాదు, చాలాకాలం తర్వాత మళ్లీ వెండితెరపై పవన్ కనిపిస్తే ఆ కిక్కే వేరు అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో పింక్ రీమేక్ అయిన వకీల్ సాబ్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. రీసంట్ గా వచ్చిన టీజర్ ఫ్యాన్స్ లో మంచి జోష్ ని నింపింది. అయితే, ఒక్క విషయం మాత్రం ఫ్యాన్స్ ని కలవరపరుస్తోందట. అదేంటంటే, బాలయ్యబాబు సెంటిమెంట్ అని అంటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే, బాలయ్య బాబు గతంలో చాలా రీమేక్ సినిమాలకి నో చెప్పాడు.

అప్పట్లో తిరుప్పాచ్చి తెలుగులో అన్నవరం సినిమా మొదటి బాలయ్య బాబు దగ్గరకే వచ్చింది. బాలయ్య బాబు సినిమా చూసి ఇది తెలుగులో వర్కౌట్ కాదని చెప్పాడు. కానీ, పవన్ కళ్యామ్ తో అన్నవరం రీమేక్ చేసి తీసారు. అది ఆశించినంత ఫలితం రాలేదు. ఇప్పుడు పింక్ సినిమా రీమేక్ కూడా బాలయ్య బాబు దగ్గరకే ఫస్ట్ వచ్చింది. తమిళంలో హిట్ అయ్యింది కానీ, తెలుగులో ఆడదు అని రిజెక్ట్ చేశాడు బాలయ్య. ఇప్పుడు మేకర్స్ ధైర్యం చేసి పవన్ తో ఈ సినిమా తీశారు. ఇప్పుడు దీని రిజల్డ్ పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు , బాలయ్య సెంటిమెంట్ ప్రకారం చూస్తే సినిమా ఎలా ఉండబోతోందో అని కలవర పడుతున్నారు.

ఈ సినిమాలే కాదు, అయ్యప్పన్ కోషియమ్ సినిమా కూడా మొదట బాలయ్య బాబు దగ్గరకే వచ్చింది. అదికూడా బాలయ్య రిజక్ట్ చేశాడు. ఇప్పుడు పవన్ అండ్ రానాలు ఇద్దరూ కలిసి ఈ సినిమా తీస్తున్నారు. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆందోళనని నింపుతోంది. మరో పక్క పవన్ కి రీమేక్ సినిమాలు బాగా కలిసొస్తాయని బంపర్ హిట్స్ అయ్యాయని కూడా అంటున్నారు ఫ్యాన్స్. మరి ఏ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus