Jr NTR: ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న బాలయ్య చిన్నల్లుడు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో రాజకీయ లెక్కలలో మార్పులు కూడా వచ్చాయి. చంద్రబాబు అరెస్టు కావడంతో ఎంతో మంది ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ ధర్నాలు నిరసనలు తెలియజేస్తున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు. ఇలా ఎన్టీఆర్ మౌనంగా ఉండడంతో ఆయన పట్ల ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే గతంలో బాలకృష్ణ చిన్నల్లుడు ఎన్టీఆర్ గురించి చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

కనుక సమయంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కు ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ప్లస్ అవుతుందా అని మీరు భావిస్తున్నారా లేక మైనస్ అవుతుందని భావిస్తున్నారా అంటూ ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు భరత్ సమాధానం చెబుతూ ఎన్టీఆర్ వల్ల పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ లేదు అంటూ ఈయన సమాధానం చెప్పారు.

అయితే ఈయన చెప్పిన సమాధానం పై పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి.ఇక మరొక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఆరోజు ఎన్టీఆర్ గురించి మాట్లాడిన విధానం పై వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ గురించి నేను మాట్లాడినటువంటి మాటలలో ఏమాత్రం తప్పులేదు కానీ నేను మాట్లాడినటువంటి తీరు తప్పుగా ఉంది దాని వల్లే అందరూ కూడా తనని విమర్శించారని తెలిపారు. ఒక పార్టీ బలపడాలి అంటే కేవలం ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు.

ఆ పార్టీకి కీలక నేతలు కార్యకర్తలు అందరూ మద్దతు తెలిపితేనే ఒక పార్టీ బలపడుతుంది. అదే విషయాన్ని నేను చెప్పాను కానీ చెప్పిన విధానం సరిగా లేకపోవడం వల్ల నన్ను ట్రోల్ చేశారు కానీ నేను చెప్పినది వాస్తవమే అంటూ ఈ సందర్భంగా భరత్ మరోసారి ఎన్టీఆర్ గురించి అన్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇలా ఎన్టీఆర్ (Jr NTR) గురించి ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus