Mokshagna: నందమూరి ఫ్యాన్స్ కు మరో తీపికబురు.. ఆరోజే ప్రకటన రానుందా?

నందమూరి మోక్షజ్ఞ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రకటన గురించి దసరా పండుగ కానుకగా క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకనుందని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ భారీ లెవెల్ లో ఉండనుందని భోగట్టా.

మోక్షజ్ఞకు జోడీగా శ్రీలీల నటించే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ సమయంలోనే నందమూరి ఫ్యాన్స్ కు మరో తీపికబురు అంటూ జరుగుతున్న ప్రచారం ఫ్యాన్స్ కు ఊహించని స్థాయిలో సంతోషాన్ని కలిగిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస విజయాలు సాధిస్తున్న బాలయ్య మోక్షజ్ఞ కెరీర్ కూడా అదే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నందమూరి మోక్షజ్ఞ (Mokshagna) ఫస్ట్ మూవీ సొంత బ్యానర్ లో తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ తొలి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేయనున్నారని మాస్, యాక్షన్ ప్రేక్షకులను సైతం అలరించే విధంగా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మోక్షజ్ఞ తొలి సినిమాలో బాలయ్య కూడా కీలక పాత్రలో కనిపిస్తారని భోగట్టా.

ఇప్పటికే తన లుక్ ను మార్చుకున్న మోక్షజ్ఞ వరుసగా సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మోక్షజ్ఞ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్లు మోక్షజ్ఞపై దృష్టి పెడతారేమో చూడాలి. మోక్షజ్ఞ తన సినిమాలు ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus