Balakrishna: సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్: విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటూ ఉండగా ఈ సినిమా సెట్ లోకి నందమూరి బాలకృష్ణ సడన్ గా ఎంట్రీ ఇచ్చారు.ఈ విధంగా తమ సినిమా షూటింగ్ లొకేషన్లోకి బాలకృష్ణ రావడంతో ఒక్కసారిగా విశ్వక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే సెట్లో బాలకృష్ణ ఉన్నటువంటి ఫోటోలను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. మా సినిమా సెట్ లో బాలయ్య గారు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇలా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు సార్. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను మీరు ఇలా రావడంతో చిత్ర బృందం మొత్తం ఎంతో సంతోషంలో ఉన్నామని తెలిపారు. ఇకపోతే ఈ సెట్లో మీతో కలిసి దిగిన ఫోటోలను నేను సోషల్ మీడియాలో షేర్ చేయలేకపోతున్నాను.

ఈ ఫోటోలను చేయటం వల్ల ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్క ఫోటోతో పాటు వీడియోలు కూడా తప్పకుండా షేర్ చేస్తాను. అంత వ‌ర‌కు ఫ్రేమ్‌లో ఉన్న బాల‌య్య బాబు చాలు.. ఫైర్ అంతే అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ సరసన నేహా శెట్టి క‌థానాయిక‌. అంజలి కీలక పాత్రలో నటిస్తుంది. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇందులో కాజల్ అగర్వాల్ శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus