బాలయ్య-బి గోపాల్ మూవీ స్టోరీ లైన్ అదుర్స్..!

బాలయ్య , డైరెక్టర్ బి.గోపాల్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమర సింహారెడ్డి, నరసింహ నాయిడు అన్ని బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం పలనాటి బ్రహ్మనాయడు. ఆ సినిమా ఘోరంగా ఫెయిల్ అవడంతో వీరి కాంబినేషన్ లో మళ్ళీ మూవీ రాలేదు. ఐతే 17ఏళ్ల తరువాత వీరిద్దరూ కలిసి ఓ చిత్రం కోసం పనిచేయనున్నారు.

యాక్షన్ అండ్ ఫ్యాక్షన్ సినిమాలకు పేరున్న వీరి కాంబినేషన్ కి భిన్నంగా ఈ సారి కొత్తగా ట్రై చేయబోతున్నారని తెలుస్తుంది. ఆలాగే ఈ సినిమా కథపై కూడా ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. తండ్రి ప్రేమను అర్ధం చేసుకోలేని కూతురు సెంటిమెంట్ తో సాగే ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందట. ఏభై ఏళ్ల వయసు ఉన్న పోలీస్ గా బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం నవంబర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా స్క్రిప్ట్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సాయి మాధవ్ స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు. బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపిస్తుండగా అందులో ఓ పాత్రలో అఘోరాగా కనింపించడం విశేషం. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus