Balakrishna: కథల విషయంలో బాలయ్య నిర్ణయాల వెనుక అసలు కారణమిదా?

స్టార్ హీరో బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా బాలయ్య కథల ఎంపిక విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య సినిమాలలో కథ కొత్తగా ఉంటున్నా కథనం రొటీన్ గా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య సినిమా అనగానే డ్యూయల్ రోల్ లో బాలయ్య కనిపిస్తాడని ఒక పాత్ర తండ్రి పాత్ర అని ఒక పాత్ర కొడుకు పాత్ర అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే వాస్తవం ఏంటంటే బాలయ్య హర్టయ్యాడు కాబట్టే ఆ విధంగా చేస్తున్నాడని సమాచారం.

కథల విషయంలో బాలయ్య ప్రయోగాలు చేయగా మెజారిటీ సందర్భాల్లో నెగిటివ్ ఫలితాలు దక్కాయి. ఊరమాస్ సినిమాలలో నటించిన సమయంలో మాత్రమే బాలయ్య పాజిటివ్ ఫలితాలను సొంతం చేసుకున్నారు. బాలయ్యపై ఈ విషయంలో విమర్శలు చేయొద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

శ్రీలీల ఈ సినిమాలో యాక్షన్ సీన్లలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ కామెంట్ల గురించి అనిల్ రావిపూడి నుంచి స్పందన రావాల్సి ఉంది. అనిల్ ఈ సినిమాకు కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. సాహో గారపాటి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు బిజినెస్ కూడా అదే విధంగా జరుగుతోంది. ఈ సినిమాను చూసిన అభిమానులు ఏ మాత్రం నిరాశ చెందరని తెలుస్తోంది.

బాలయ్య (Balakrishna) అనిల్ కాంబో మూవీ దసరాకు సంచలనాలు సృష్టించనుందని ఈ ఏడాది దసరా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో బాలయ్యకు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus