గత కొద్ది రోజులుగా బాలయ్యపై జరుగుతున్న విషప్రచారానికి, అసెంబ్లీ సాక్షిగా బాలయ్య క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఆ కధ అంతా పక్కన పెడితే అదే అసెంబ్లీ వేదికగా బాలయ్య తన 100వ సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు. అసెంబ్లీ అనంతరం లాబీల్లో మాట్లాడిన బాలయ్య తన 100వ చిత్రం విశేషాలు చెప్పాడు. ఆయన మాట్లాడుతూ అమావాస్య వెళ్ళాక తన 100వ సినిమా విశేషాలు అందరికీ చెబుతాను అన్నారు. అయితే మరో పక్క ఇప్పటికే ఈ చిత్రం విషయమై బాలయ్య అనేక కధలు విన్నాడు. తొలుత అందరూ బాలయ్య 100వ సినిమాగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదిత్య369 సీక్వెల్ ఆదిత్య 999ఉంటుంది అని అనుకున్నారు. ఇదే విషయమై బాలయ్య సైతం ఒకానొక భేటీలో కేసీఆర్ కు చెప్పేసాడు కూడా, కానీ అభిమానుల నుంచి వచ్చిన కోరిక మేరకు, ప్రస్తుత తరం దర్శకులతో సినిమా చెయ్యాలి అని బాలయ్య అనుకున్నాడు.
మరో పక్క బాలయ్య 100వ సినిమాకి అందరూ తొలుత బోయపాటి దర్శకత్వం వహిస్తాడు అని అనుకున్నారు. కానీ బోయపాటి మిగిలిన సినిమాలతో బిజీగా ఉండడం వల్ల బాలయ్య అతన్ని పెద్దగా కన్సిడర్ చెయ్యలేదు. ఇక అదే క్రమంలో రైతు సమస్యలపై ఒక పవర్‌ఫుల్ కధతో రంగంలోకి దిగాడు దర్శకుడు కృష్ణ వంశీ, ఆ కధ విన్న బాలయ్య ఈ సినిమా చేస్తే బావుంటుంది అని అనుకునే లోపే, శాతవాహన రాజు అయిన గౌతామీ పుత్ర శాతకర్ణ కధ ఆధారంగా ఒక చారిత్రక కధతో క్రిష్ ఎంట్రీ ఇచ్చాడు. వీళ్ళిద్దరినీ హోల్డ్ తో పెట్టిన బాలయ్య త్వరలోనే ఆయన సినిమాపై క్లారిటీ ఇస్తారు అని సినీ పరిశ్రమ నుంచి వస్తున్న వాదన. మరి చూడాలి ఆ అదృష్టం ఏ దర్సకున్ని వరిస్తుందో.