Balayya Babu: వాలెంటైన్స్ డే ఫిబ్రవరిలో కాకుండా నవంబర్లో చేసుకోవాలంటున్న బాలయ్య?

నందమూరి కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన నందమూరి బాలకృష్ణ గురించి తెలియనివారంటు ఉండరు. దాదాపుగా 42 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ 100కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలకృష్ణ.. ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇలా సినిమాలలో మాత్రమే కాకుండా ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా వ్యాఖ్యాతగా మారి తనదైన శైలిలో హోస్ట్ చేస్తూ ఇటు బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో అధిక సంఖ్యలో రేటింగ్స్ సొంతం చేసుకుని

దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందింది. ఇక ఈ రియాలిటీ షో ద్వార నందమూరి కుటుంబానికి అండ కుటుంబానికి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. గతంలో అల్లు రామలింగయ్య, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుండి వీరి కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ అన్ స్టాపబుల్ షో వల్ల అది మరింత బలపడింది. అల్లు శిరీష్ హీరోగా నటించిన “ఊర్వశివో రాక్షసివో” అని సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణని అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

చాలాకాలం తర్వాత అల్లు శిరీష్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇక ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలకృష్ణ సినిమా గురించి…అల్లు శిరీష్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సినిమా అనేది ప్రజల జీవితంలో ఒక భాగం అయిపోయింది. అందువల్ల ప్రేక్షకులందరినీ అలరించడం మన బాధ్యత.ఈ సినిమా ట్రైలర్ చూస్తే మసాలా బాగా ఉన్నటు ఉంది.

సినిమా యూత్ ఆడియన్స్ కి బాగా ఎక్కేస్తుందని సరదాగ స్పందించారు. అంతే కాకుండా ఈ రొమాన్స్ అంతా సినిమా వరకేనా లేక… బయట కూడా ఉందా అంటూ సరదాగా అల్లు శిరీష్ ని ఆట పట్టించాడు. అంతేకాకుండా వాలెంటైన్స్ డే డేట్ ఫిబ్రవరి 14 నుంచి నవంబర్ 4న మార్చి పెట్టాలని.. ఈ సినిమా చూశాక అందరు అదే కోరుతారని బాలకృష్ణ సరదాగా స్పందించాడు. ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సూటిగా మాట్లాడే బాలకృష్ణ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా మాట్లాడి అల్లు అభిమాను బాగా ఆకట్టుకున్నాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus