Balakrishna Watch Cost: ‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య పెట్టుకున్న వాచ్ రేటు ఎంతంటే..?

బాలయ్య బాబుకి కల్మషం తెలియదు.. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం.. కోపం ఎక్కువ అంటారు కానీ మంచిగా ఉంటే మంచి.. తేడా చేస్తే తేడా అన్నట్టే ఉంటుంది ఆయనతో వ్యవహారం..సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు, టాక్ షో, ఈమధ్య కొత్తగా యాడ్స్.. ఇలా నిత్యం బిజీ బిజీగా గడుపుతూ.. 60 ప్లస్‌లోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారాయన.. ప్రొఫెషన్ సంగతి పక్కన పెడితే.. పర్సనల్‌గా బాలయ్య స్టైలింగ్ భలే ఉంటుంది..

అసెంబ్లీ, హిందూపూర్ నియోజకవర్గ పర్యటనలైతే వైట్ అండ్ వైట్‌లో మెరిసిపోతుంటారు.. ఇక నార్మల్‌గా డిజైనింగ్ షర్ట్స్, ఫుల్ హ్యాండ్స్ ఫోల్డ్ చెయ్యకుండా ఎడమ చేతి మణికట్టుపైన వాచ్ పెట్టడం బాలయ్య స్టైల్.. సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తుంటారు.. ఇక టాక్ షోలో వాడే కాస్ట్యూమ్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. స్టైలింగ్‌తో అదరగొట్టేస్తున్నారు.. ‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ బాలయ్య తన స్టైల్‌లో ఆకట్టుకున్నారు.. గతంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫంక్షన్‌లోనూ ఇలాంటి డ్రెస్‌లో అదరగొట్టేసిన బాలయ్య తన సినిమా కార్యక్రమంలో ఆద్యంతం హైలెట్‌గా నిలిచారు..

ఇతర సినిమా ప్రోగ్రామ్స్‌లో స్టైలిష్ కాస్ట్యూమ్స్, బ్లేజర్‌తో కనిపిస్తుంటారు.. అయితే బాలయ్య డ్రెస్సెస్ లేదా యాక్సెసరీస్ గురించి పెద్దగా ఎప్పుడూ వార్తలు వచ్చినట్టు అనిపించదు.. కానీ ఈసారి ఫ్యాన్స్ ఒప్పుకునేలా లేరు.. అందుకే వారి చూపు ‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య పెట్టుకొచ్చిన వాచీపైన పడింది.. వెంటనే తమ అభిమాన నటుడి వాచ్ కంపెనీ, కాస్ట్ వంటి వివరాలు సేకరించి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు..

ఇక బాలయ్య ధరించిన వాచ్ విషయానికొస్తే.. అది.. కార్టియర్ శాంటాస్ 100 స్కెలెటిన్ (Cartier Santos 100 Skeleton) బ్రాండ్‌కి చెందింది.. దీని ధర.. అక్షరాలా.. రూ. 26,90,000 అన్నమాట.. బాలయ్య వాచ్ పెట్టుకున్న పిక్స్‌తో పాటు దాని రేటు గురించి నెట్టింట న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్యాన్స్.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘వీరసింహా రెడ్డి’ గా బాలయ్య బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నారు..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus