Balakrishna: బాలయ్య వెకేషన్ కు వెళ్లడం వెనుక అసలు రీజన్ ఇదేనా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తాజాగా భగవంత్ కేసరి క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ జరిగిందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం బాలయ్య కుటుంబం, మనవడితో కలిసి వెకేషన్ కు వెళ్లారు. బాలయ్య ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ కాగా ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాలయ్య విజయాలను సొంతం చేసుకోగా భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాలయ్య త్వరలో సినిమా కార్యక్రమాలతో పాటు, పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ కానున్నారు. మళ్లీ సమయంలో దొరకకపోవచ్చని భావించి బాలయ్య ఫ్యామిలీతో సహా వెకేషన్ కు వెళ్లారని బోగట్టా. బాలయ్య, కాజల్, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య రోల్ స్పెషల్ గా ఉండనుందని సమాచారం అందుతోంది. ఇప్పటివరకు పోషించని తరహా పాత్రను బాలయ్య పోషించనున్నారని సమాచారం అందుతోంది. బాలయ్యకు తర్వాత సినిమాలతో భారీ విజయాలు దక్కాలని బాలయ్య మార్కెట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బాలయ్య (Balakrishna) నటిస్తున్న భగవంత్ కేసరి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య డైలాగ్ డెలివరీ సైతం సరికొత్తగా ఉండనుందని సమాచారం అందుతోంది. బాలయ్య దసరా కానుకగా రిలీజయ్యే ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. స్టార్ హీరో బాలకృష్ణ క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

డబుల్ హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే స్టార్ హీరోల సినిమాల ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై అనిల్ దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus