Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కు రిప్లై ఇచ్చింది బాలయ్య చిన్న కూతురా.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన దేవర (Devara) రిలీజ్ కు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. దేవర ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో దేవర సినిమా నుంచి వరుస అప్ డేట్స్ రానున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

చంద్రబాబు, లోకేశ్, బాలయ్య (Balakrishna) , పురంధేశ్వరిలతో పాటు విశాఖ ఎంపీగా గెలిచిన శ్రీ భరత్ కు కూడా ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్పడంతో శ్రీ భరత్ ట్విట్టర్ అకౌంట్ నుంచి “థాంక్యూ తారక్ అన్న, రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమంతా కృత నిశ్చయంతో ఉన్నాం. దేవర సినిమాతో మీకు మంచి విజయం వస్తుంది అని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు ఒకవేళ శ్రీ భరత్ రిప్లై ఇచ్చి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ను బావ అని పిలిచేవారు. అలా పిలవకుండా అన్న అని పిలవడంతో తేజస్విని రిప్లై ఇచ్చారని క్లారిటీ వచ్చేసింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఈ అన్నాచెల్లెళ్ల బాండింగ్ కు మాత్రం ఫిదా అవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కు చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యి రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. దేవర సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు పోటీగా వేట్టయాన్ సినిమా విడుదల కానుంది. దేవర, వేట్టయాన్ (Vettaiyan) సినిమాలు రెండూ ఒకేరోజు విడుదలైనా రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ రెండు సినిమాల బడ్జెట్ 500 కోట్ల రూపాయల కంటే తెక్కువ మొత్తం కావడం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus