టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్లకి ఇప్పుడు హీరోలు దొరకడం లేదు. మహేష్ బాబు (Mahesh Babu).. రాజమౌళి (S. S. Rajamouli) ప్రాజెక్టుతో 3 ఏళ్ళు బిజీ బిజీగా గడపనున్నాడు. అల్లు అర్జున్ (Allu Arjun) … త్రివిక్రమ్ కి (Trivikram) 2 ఏళ్ళు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఒక సినిమా, సుకుమార్ (Sukumar) తో ‘పుష్ప 3’.. సో బన్నీ కూడా 6 ఏళ్ళ వరకు ఖాళీ అవ్వడం కష్టం. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కమిట్ అయిన సినిమాలు 3 ఉన్నాయి.
మరోపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు కాబట్టి.. సినిమాలు చేయడం కష్టం. ప్రభాస్ (Prabhas) సంగతి చెప్పనక్కర్లేదు. అతను కూడా 3 ఏళ్ళు లాక్ అయిపోయినట్టే. రాంచరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana), సుకుమార్..ల సినిమాలకి కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ (Jr NTR) అయితే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రాజెక్టుతో, ‘వార్ 2’ తో బిజీ. అందుకే ఇలాంటి టైంలో కొంతమంది స్టార్ డైరెక్టర్లకి సీనియర్ హీరోలే దిక్కు అయిపోయారు. వీరిలో కూడా ఫస్ట్ ఆప్షన్ అంటే చిరు, బాలయ్య..లే..!
గత ఏడాది నుండి చూసుకుంటే.. బాలకృష్ణతో (Nandamuri Balakrishna) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చేసిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఇప్పుడు చిరు కోసం కథ రెడీ చేసుకుంటున్నాడు. మరోపక్క చిరంజీవితో (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి బ్లాక్ బస్టర్ తీసిన బాబీ, ఇప్పుడు బాలకృష్ణతో ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) చేస్తున్నాడు. అంతేకాదు బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) తీసిన దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) త్వరలో చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు.
ఇక చిరుతో సినిమా చేస్తున్న మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) కూడా బాలకృష్ణ కోసం ఓ కథ రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇలా బాబీ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్స్.. అయితే చిరుతో లేదంటే బాలకృష్ణతో సినిమాలు చేసుకుంటూ గడిపేస్తున్నారు.