Balakrishna: స్టార్ హీరో బాలయ్య చేసిన ఈ పని తెలిస్తే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య (Balakrishna)  వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా బాలయ్య ఈ మధ్య కాలంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా నడుచుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. బాలయ్య తాజాగా ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకుంటూ ఉన్న సమయంలో ఒక మహిళా అభిమాని బాలయ్య దగ్గరకు వచ్చి బాలయ్యతో మాట్లాడటంతో పాటు బాలయ్యను ఆలింగనం చేసుకుని ఆప్యాయత కనబరిచింది. ఆమె అభిమానానికి బాలయ్య సైతం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.

Balakrishna

అభిమానులు ఎవరైనా హద్దులు దాటితే బాలయ్య కొడతారని ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రూవ్ అయింది. అయితే అభిమానుల బిహేవియర్ ఆధారంగానే బాలయ్య బిహేవియర్ ఉంటుందని బాలయ్య బంగారం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య బాబీ  (Bobby) కాంబో మూవీ రిలీజ్ కు సంబంధించిన స్పష్టత కోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బాలయ్య బాబీ కాంబో మూవీ యాక్షన్ లవర్స్ కు నచ్చేలా ఉండనుందని ఈ సినిమా ఖర్చు విషయంలో సితార నిర్మాతలు ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది.

బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారో లేక సింగిల్ రోల్ లో నటిస్తున్నారో క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య బాబీ మూవీ ఎప్పుడు విడుదలైనా బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో సైతం ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. బాలయ్య సినిమాలు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందిస్తున్న సంగతి తెలిసిందే.

అందువల్ల బాలయ్య సినిమాలకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరుగుతోందని తెలుస్తోంది. బాలయ్య కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తుండటం ఆయన సక్సెస్ సీక్రెట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో బాలకృష్ణ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. సీనియర్ హీరోలలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో బాలయ్య ఒకరిగా ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus