Balakrishna: ఇప్పుడు బాలయ్య, అల్లు అరవింద్ కూడా చిక్కుల్లో పడినట్టేనా?

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత చెడిపోతుందని, రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింటుందని.. వారిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తామని సజ్జనార్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మియాపూర్ పీఎస్‌, పంజాగుట్ట పీఎస్ లలో టాలీవుడ్ ప్రముఖులపై కేసులు నమోదవడం జరిగింది. రానా దగ్గుబాటి(Rana Daggubati) , మంచు లక్ష్మి (Manchu Lakshmi)  , నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), ప్రకాష్ రాజ్ (Prakash Raj), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), అనన్య నాగళ్ల (Ananya Nagalla), ప్రణీతలపై (Pranitha Subhash) వంటి నటీనటులతో పాటు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి.

Balakrishna

విష్ణుప్రియ (Vishnupriya) వంటి వారిపై కేసులు నమోదవడం కూడా జరిగింది.తాజాగా ఈ లిస్టులో బాలయ్య (Nandamuri Balakrishna) పేరు కూడా తెరపైకి రావడం అనేది అందరికీ షాకిచ్చింది. విషయం ఏంటంటే… ‘ఆహా’ ఓటీటీ కోసం నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ అనే రియాలిటీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4 సీజన్లు ముగిశాయి. అయితే సీజన్ 2 లో బాలకృష్ణ కూడా ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశాడట. ప్రభాస్ (Prabhas) ,గోపీచంద్  (Gopichand) ..లకి ప్రెజెంటేషన్ ఇస్తున్న టైంలో ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ ఉందని..

దాన్ని బాలయ్య ప్రమోట్ చేశాడు అని నెటిజన్లు భావిస్తున్నారు. మరోపక్క నెల్లూరుకి చెందిన శ్రీ రాంబాబు.. బాలయ్య ఆ యాప్ ను ప్రమోట్ చేయడం వల్లే దాన్ని డౌన్లోడ్ చేసుకుని.. గేమ్ ఆడానని. దాని వల్ల రూ.80 లక్షలు పోగొట్టుకున్నాను అని అతను ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చాడు. దీంతో ఆహాతో కూడా బాలయ్య కూడా చిక్కుల్లో పడినట్టే అని కొందరు భావిస్తున్నారు. మరి వారికి లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి అనేది తెలియాల్సి ఉంది.

సినీ పరిశ్రమలో విషాదం.. నటి తల్లి కన్నుమూత!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus