Balayya Babu: బాలయ్యతో మరోసారి.. బోయపాటి ప్లాన్ ఇదే!

నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లతో కలిసి పని చేశారు. కానీ బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఇప్పటివరకు వీరి కాంబోలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. రీసెంట్ గా వచ్చిన ‘అఖండ’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.

Click Here To Watch NOW

ఈ సినిమా తరువాత వీరి కాంబినేషన్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. చాలా మంది నిర్మాతలు వీరితో కలిసి సినిమా చేయాలనుకుంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. ఈసారి పొలిటికల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కించనున్నారు బోయపాటి శ్రీను. ఈ సినిమాను 2023 సెకండ్ హాఫ్ లో మొదలుపెట్టాలని చూస్తున్నారు. అప్పటికి బాలకృష్ణ తన ప్రాజెక్ట్ లను పూర్తి చేసుకొని రెడీగా ఉంటారు.

ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేనితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అలానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యారు. ఆ తరువాత బోయపాటి సినిమా చేయనున్నారు. మరోపక్క బోయపాటి.. హీరో రామ్ తో సినిమా చేయబోతున్నారు. ఇది పూర్తి కాగానే బాలయ్య సినిమా స్క్రిప్ట్ పై పని చేయనున్నారు. బాలయ్య-బోయపాటి సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించనున్నారు.

త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. 2024 ఎలెక్షన్స్ కి ముందుగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus