Balakrishna: ‘అఖండ’.. బాలయ్యకి అంత తక్కువ ఇస్తున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఒక స్టార్ హీరోలు యాభై కోట్ల వరకు ఇస్తారు. మిడ్ రేంజ్ హీరోలు పది కోట్లకు పైగానే తీసుకుంటారు. కానీ సీనియర్ హీరోలకు మాత్రం ఆశించిన రేంజ్ లో రెమ్యునరేషన్స్ రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి సంగతి పక్కన పెడితే.. నాగార్జున కి స్టాండర్డ్ రెమ్యునరేషన్ ఉంటుంది. అయిదారు కోట్ల రేంజ్ లో ఆయనకి పారితోషికం ఇస్తారు. ఇక వెంకటేష్ తన సినిమాల రిజల్ట్ బట్టి రెమ్యునరేషన్ మారుస్తూ ఉంటారు. ‘ఎఫ్ 3’ సినిమాకి వెంకీకి బాగానే ముట్టజెప్పుతున్నారని తెలుస్తోంది.

ఇక మరో సీనియర్ హీరో బాలయ్యకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనే విషయంలో స్పష్టం వచ్చింది. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి టీజర్ కి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. యూట్యూబ్ లో ఈ సినిమా టీజర్ రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా కోసం బాలయ్యకి ఎంతిచ్చారనే విషయం ఆరా తీయగా.. రూ.7 కోట్లు అని తెలుస్తోంది. ముందుగా బాలయ్య పది కోట్లు డిమాండ్ చేశారని.. కానీ బోయపాటి కన్విన్స్ చేసి ఏడు కోట్లకు ఒప్పించారని సమాచారం.

ఈ సినిమా కోసం బోయపాటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. లాభాల్లో వాటా తీసుకునే విధంగా నిర్మాత రవీందర్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ‘అఖండ’ సినిమాను నిర్మించడానికి మొత్తంగా రూ.70 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేసుకున్నారు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో కాస్త కంట్రోల్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే బాలయ్యని కూడా తక్కువ రెమ్యునరేషన్ కి ఒప్పించారట.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus