సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలా ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న కాంబినేషన్లలో బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా కూడా ఒకటి. ఈ కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా ఈ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొక సినిమా సక్సెస్ సాధించాయి. సింహా, లెజెండ్, అఖండ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా అఖండ 175 రోజుల పాటు ప్రదర్శించబడిన రామకృష్ణ థియేటర్ లో జరిగిన వేడుకలకు హాజరై మాట్లాడుతూ నందమూరి అభిమానులకు తాను మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
సింహా, లెజెండ్, అఖండ సినిమాలు థియేటర్లలో 175 రోజుల పాటు ప్రదర్శించబడ్డాయని ఆయన వెల్లడించారు. బాలయ్య నాపై పెట్టుకున్న నమ్మకం వల్లే తమ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు హిట్టయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. తాను 10 నిమిషాలు మాత్రమే చెప్పిన కథ విని బాలయ్య సింహా, అఖండ, లెజెండ్ సినిమాలకు ఓకే చెప్పారని బాలకృష్ణ నమ్మకాన్ని నిజం చేసినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ మూడు సినిమాల సక్సెస్ ను సీనియర్ ఎన్టీఆర్ కు అంకితం చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
భవిష్యత్తులో నేను తెరకెక్కించే సినిమాలను సైతం ప్రేక్షకులు ఆదరించాలని బోయపాటి శ్రీను కామెంట్లు చేశారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్ లో లెజెండ్2, అఖండ2 తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.