పాత్రలో నటించడం కంటే… పాత్రలో ఒదిగిపోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు బాలకృష్ణ. అందుకే పరిశ్రమలో వంద సినిమాలకుపైగా నటించినా… తనదైన మ్యాజిక్‌ను ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాడు. అలా తాజాగా తన డబుల్ మ్యాజిక్ చూపించాడు ‘అఖండ’తో. అలాగే హీరోయిజం బాలయ్య ఒంట్లో ఉంటుంది అంటుంటారు. దాంతో విలనిజం కూడా ఓ మూల ఉందా? అవుననే అనిపిస్తోంది ఆయన మాటలు వింటుంటే.
సినిమాలు, పాత్రలు గురించి ఇటీవల ఓ షోలో బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పుడవి వైరల్‌గా మారాయి. అవే విలనిజం గురించి. ఎవరైనా మంచి విలన్ పాత్రతో ముందుకొస్తే… విలన్‌గా నటించడానికి నేను సిద్ధం అంటూ… బాలయ్య ప్రకటించేశాడు. దీంతో కార్యక్రమం లైవ్‌లో చూస్తున్నవాళ్లంతా షాక్ అయ్యారు. దాంతో పాటు బాలయ్య ఇంకో చిన్న మెలిక కూడా పెట్టారు. అది ఇంకా మజా ఇచ్చిందనుకోండి.
ఎలాంటి పాత్ర కైనా బాలయ్య సిద్ధమనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో విలన్‌గా నటించడానికి కూడా ఓకే అంటున్నారు. అయితే హీరో కూడా తానే ఉండాలనేది ఆయన మాట. అంటే హీరో – విలన్ డ్యూయల్ రోల్ అన్నమాట. మరి ఇలాంటి కథను ఎవరు సిద్ధం చేస్తారో చూడాలి. బోయపాటి లాంటి బాలయ్య పల్స్ తెలిసిన దర్శకుడు అయితే ఆ సినిమా ఇంకా మజాగా ఉంటుంది అని చెప్పొచ్చు.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!