టాలీవుడ్ లో ఈ మధ్య జానపద చిత్రాల్ హడావిడి కాస్త ఎక్కువ అయ్యింది. భారీ గ్రాపిక్స్ తో కధ లేకుండా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే అదే క్రమంలో అంత భారీ సినిమాలు..అందులో భారీ తారలు అంటే….సినిమాలపై అంచనాలు కూడా అంతే భారీ లెవెల్ లో ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే రాజమౌళి బాహుబలి, గుణ షేకర్ రుద్రమ దేవి ఈ రెండు గ్రాఫిక్స్ ఒరియాంటెడ్ సినిమాలే కావడంతో వాటి విడుదల రోజుల్లో చాలా హంగామా నడిచింది.
ఇదిలా ఉంటే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో జానపద చిత్రాలు నటించాలన్నా…నటించి మెప్పించాలన్నా కేవలం నందమూరి వంసానికే సాధ్యం….అయితే అదే క్రమంలో బాలయ్య “గౌతామీ పుత్ర శాతకర్ణి” సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ సినిమాని తన 100వ చిత్రంగా భారీగా ప్లాన్ చేసుకున్నాడు మన నట సింహం. ఇదిలా ఉంటే ఈ మధ్య ప్రతీ సినిమాని జక్కన్న బాహుబలితో పోల్చడం అలవాటు అయిపోయింది.
అదే క్రమంలో ఈ సినిమాను సైతం బాహుబలితో పోలుస్తూ కొందరు ఇదే టాపిక్ ని రాజమౌళి వద్ద తీసుకురాగ…గౌతమిపుత్ర శాతకర్ణి , బాహుబలి రెండు కూడా దేనికదే ప్రాధాన్యత ఉన్నవే నని బాహుబలి కి గౌతమిపుత్ర శాతకర్ణి కి అసలు సబంధమే లేదని, వాటి రేంజ్ కూడా వేరని తన సన్నిహితుల వద్ద జక్కన్న వాపోయాడని సమాచారం…ఇక జక్కన్న రేంజ్ గురించి మాట్లాడటంతో అదీ….బాలయ్య సినిమా విషయంలో నందమూరి అభిమానులు ఆయనపై కోపంతో రగిలిపోతున్నారు. ఒక గొప్ప చిత్రం రూపొందుతున్న నేపథ్యంలో రాజమౌళి ఇలా మాట్లాడటం ఎంతవరకూ కరెక్ట్ అని ఆయనపై విమర్శలు చేస్తున్నారు….