Balakrishna: గోపీచంద్‌ మలినేని సినిమా విషయంలో ఇలా ఎందుకు..!

ఏదైనా సినిమా హిట్‌ అయితే.. ఆ సినిమా తరహా జోనర్‌లో మరో సినిమా చేయడానికి మన హీరోలు ఇష్టపడతారు. ఒకేలా ఉంటాయేమో అనే భయంతోనే అలాంటి సినిమానే చేసి ఒక్కోసారి హిట్‌ కొడతారు, ఒక్కోసారి బోర్లా పడుతుంటారు కూడా. అయితే ఓ సినిమా ప్రచారం కోసం వాడిన స్ట్రాటజీని తర్వాతి సినిమాకు కూడా వాడుతాం అంటే, అలాగే ఆ సినిమా రిలీజ్‌ డేట్‌కే ఈ సినిమాను తీసుకొస్తాం అంటే ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది నందమూరి బాలకృష్ణనే. ఎందుకంటే ఆయన సినిమా గురించే ఇదంతా.

బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. #NBK107 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదల విషయంలో బాలయ్య ఓ నిర్ణయానికి వచ్చారు అని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను విజయదశమి కానుకగా విడుదల చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను డిసెంబరుకు జరిపారని చెబుతున్నారు. డిసెంబరు 2న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. అదే రోజున గతేడాది ‘అఖండ’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

ఇంచుమించు ఈ సెంటిమెంట్‌తోనే బాలయ్య #NBK107ను కూడా అదే రోజు విడుదల చేయాలని చూస్తున్నారని అంటున్నారు. మామూలుగానే బాలయ్యకు సెంటిమెంట్లు ఎక్కువ అంటుంటారు. మరి అందుకే డేట్ అదనుకుంటున్నారా అనేది తెలియాలి. ఇక ఈ సినిమా టైటిల్‌ను ఇప్పటివరకు అనౌన్స్‌ చేయలేదు. పోస్టర్ల మీద పోస్టర్లు, వీడియోలు వస్తున్నాయి కానీ పేరు మాత్రం చెప్పలేదు. ‘అఖండ’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.

#BB3 పేరుతో సినిమాను చాలా రోజులు లైన్‌లో ఉంచారు. ఊరించి ఊరించి ఆఖరికి ‘అఖండ’ అనే పేరు పెడుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు #NBK107 విషయంలోనూ అదే పని చేయాలని చూస్తున్నారట. ఇక ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతోంది. అక్కడ షూటింగ్‌ స్పాట్‌ పిక్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వైట్‌ అండ్‌ వైట్‌లో బాలయ్య అదిరిపోయాడని కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. ఈ నెల 26 వరకు అక్కడే షూటింగ్‌ ఉంటుంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus