టీవీ షోలకు, ఓటీటీ షోలకు గెస్ట్‌లు రావడం చాలా కష్టం. షో రన్ చేసేటప్పుడు తొలి సీజన్లకు ఈజీగా గెస్ట్‌లు దొరికేస్తారు. ఆ తర్వాత సీజన్లు మారే కొద్దీ గెస్ట్‌లు కష్టం. ఈ సమస్యను చాలామంది హోస్ట్‌లు, షో టీమ్‌లు ఫేస్ చేశాయి. దీంతో షో ఆపేస్తుంటాయి. అయితే బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్‌లోకి వచ్చింది. అయితే ఈ సీజన్‌కు ఏదో సమస్య ఉండో, లేక ఆబ్లిగేషన్ ఉండో ‘లిమిటెడ్ ఎడిషన్’ అనే కాన్సెప్ట్‌లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో రెండో ఎపిసోడ్ రాబోతోంది.
తొలి ఎపిసోడ్‌కి తన సినిమా టీమ్‌నే పిలిచి సందడి చేసిన (Balayya) బాలయ్య… ఇప్పుడు రెండో ఎపిసోడ్‌కి ఏకంగా బాలీవుడ్ సినిమా టీమ్‌ను తీసుకొస్తున్నారని టాక్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘లిమిటెడ్ ఎడిషన్ అన్‌స్టాపబుల్’లో ఈసారి రణ్‌బీర్ కపూర్ – రష్మిక మందన రావొచ్చు. అవును ‘యానిమల్’ టీమ్‌ను అన్‌స్టాపబుల్‌కి తీసుకొస్తున్నారని ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు తెలుగులో మంచి ప్రచారం ఇవ్వాలనే ఉద్దేశంలో తెలుగు షోలకు సినిమాను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. ఈ క్రమంలోనే ‘అన్‌స్టాపబుల్’కి వస్తున్నారు అని చెబుతున్నారు.
హీరో రణ్‌బీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరోయిన్ రష్మిక మందన హాజరయ్యే స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుందని చెబుతున్నారు. నవంబర్ లాస్ట్ వీక్‌లో ఈ ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యేలా చూసుకుంటున్నారట. ఈ సినిమాను డిసెంబరు 1న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు రణ్‌బీర్‌తో తెలుగులో కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ‘బ్రహ్మాస్త్ర’ విషయంలోనూ టీమ్ ఇలాంటి ప్రయత్నాలే చేసి విజయం సాధించింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా కూడా అదే చేస్తున్నారు.
ఇక ‘యానిమల్’ సినిమా విషయానికొస్తే.. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రణ్‌బీర్ పాత్ర చాలా వైలెంట్‌గా ఉంటుందట. ఎంత జరిగినా, ఏం జరిగినా తన తండ్రి అంటే తనకు చాలా ఇష్టం అని చెబుతుంటాడు. అయితే కొడుకు మీద తండ్రికి ఎందుకు కోపం, అన్ని మాటలు అంటున్నా, కొట్టినా తండ్రి అంటే కొడుకుకు ఎందుకు అభిమానం అనేది సినిమాలో కీలకాంశం అని చెబుతున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతుంది.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!