Balakrishna: కరోనా బాధితుల కోసం బాలయ్య ఏం చేశారంటే..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స కోసం చేరితే లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్ కొరత, మందుల కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సోకిన వాళ్లను ఇతర అనారోగ్య సమస్యలు సైతం వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో టాలీవుడ్ హీరోలు తాము రియల్ హీరోలమని ప్రూవ్ చేసుకుంటున్నారు. కరోనా బాధితులకు మేలు జరిగేలా టాలీవుడ్ సెలబ్రిటీలు తమ వంతు సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్టార్ హీరో చిరంజీవి జిల్లాకు ఒక ఆక్సిజన్ బ్యాంక్ చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య ఆయన గెస్ట్ హౌస్ ను కరోనా బాధితుల కొరకు కేటాయించారని తెలుస్తోంది. సీనియర్ స్టార్ హీరోలు కరోనా బాధితులకు సాయం చేయడం కోసం ముందుకు వస్తుండటం గమనార్హం. తమిళనాడులో స్టార్ హీరోలు ఆ రాష్ట్ర సీఎంను కలిసి విరాళాలు అందించగా తెలుగు రాష్ట్రాల్లోని స్టార్ హీరోలు తమకు చేతనైనంత సహాయం చేస్తున్నారు.

బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తై రిలీజైన తర్వాతే కొత్త సినిమాల షూటింగ్ లలో పాల్గొనాలని బాలయ్య భావిస్తున్నట్టు తెలుస్తోంది. అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణ నటించనున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus