బాలయ్య సాంగ్ తో రెచ్చిపోతున్న అల్లరి నరేష్..!

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలు, స్టార్ హీరోల సూపర్ హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేయడం కొత్తేమీ కాదు. చాలాసార్లు చాలామంది హీరోలు ఈ సాంగ్స్ ని యాప్ట్ చేసుకుని మరీ చేశారు. ముఖ్యంగా సాయిథరమ్ తేజ్ సినిమాల్లో చిరంజీవి సాంగ్స్ రావడం అనేది చాలా కామన్. అయితే, రీసంట్ గా మాత్రం ఈ రీమిక్స్ సాంగ్స్ హడావుడి కాస్త తగ్గింది. కానీ, ఇప్పుడు మళ్లీ నేనున్నాను అంటూ అల్లరి నరేష్ అల్లరిబుల్లోడు సినిమా సాంగ్ రీమిక్స్ తో రెచ్చిపోతున్నాడు.

బాలయ్య బాబు నటించిన బంగారుబుల్లోడు సినిమాలోని స్వాతిలో ముత్యమంత ముద్దులా అల్లుకుంది అనే సాంగ్ ని ఇప్పుడు అల్లరి బుల్లోడుగా అల్లరి నరేష్ చేస్తున్నాడు. ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసింది మూవీ టీమ్. పూజాఝవేరి , అల్లరి నరేష్ ఈసాంగ్ చేస్తూ రెచ్చిపోతున్నారు. కాస్టూమ్స్ కూడా సింక్ అయ్యేలా ఎల్లో కలర్ శారీలో అలనాటి రవీనా టాండెన్ ని మరిపిస్తోంది పూజా ఝవేరి. వానా వానా వచ్చేనంట అంటూ స్వింగ్ స్టెప్పులు వేస్తూ నరేష్ తనమార్క్ ని మరోసారి ప్రేక్షకులకి చూపిస్తున్నాడు.

యూట్యూబ్ లో రిలీజైన ఈ ప్రోమో సినీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. ఎ.కె ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈసినిమాని గిరి పల్లిక డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా జనవరి 23వ తేదిన గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది మూవీ టీమ్.


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus