Balakrishna,Anil Ravipudi: తెలుగుదనం లేదన్న బాలయ్య.. ఆలోచనలో పడ్డ అనిల్?

బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఎలాంటి హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో బాలయ్య అదే ఊపులో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలను పెంచేసింది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు.ఈ క్రమంలోనే అనిల్ బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ తయారు చేసి ఇందులో నటీనటుల ఎంపిక కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి ఇక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడమే తరువాయి. ఈ క్రమంలోనే బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ తయారు చేసిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు ‘బ్రో ఐ డోన్ట్ కేర్’ అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

దాదాపు ఫిక్స్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ టైటిల్ విన్న బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఈ టైటిల్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.అనిల్ సూచించిన టైటిల్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ అందులో తెలుగుదనం లేకపోవడంతో బాలకృష్ణ ఈ టైటిల్ రిజెక్ట్ చేసి మరొక టైటిల్ ఆలోచించాలని చెప్పారట. ఈ క్రమంలోనే స్క్రిప్ట్ కు సరైన టైటిల్ చెప్పినప్పటికీ బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో అనిల్ ఈ సినిమాకు మరో టైటిల్ ఆలోచించే పనిలో పడినట్లు తెలుస్తోంది.

ఇకపోతే బాలకృష్ణ అనిల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ అయ్యాకే ఒకేసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాని ఆగస్టు నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్లడానికి మేకర్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ 3 సినిమాతో మంచి హిట్ కొట్టిన అనిల్ బాలయ్య బాబుకు కూడా అంతకుమించి హిట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus