Balayya Babu: హిస్టరీ రిపీట్ చేయనున్న బాలయ్య క్రేజీ కాంబో..

వీరసింహారెడ్డి తర్వాత ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. దసరాకు రాబోతుంది.ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ ఖరారు అయ్యింది. ఇక తాజాగా బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ టీజర్‌ను వదిలారు. టీజర్ కూడా కేక పెట్టించింది. ఈ మూవీలో హిందీ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్‌గా నటిస్తున్నాడు.

ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌కు మరో రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. నెలకొండ భగవంత్ కేసరి అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త సినిమాను ప్రకటించారు. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ నిర్మించనుంది. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు. అయితే ఈసినిమాలో హీరోయిన్‌గా బాలయ్య సరసన నయనతార నటించనుందని తెలుస్తోంది. ఆమెను టీమ్ ఖరారు చేసిందని టాక్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సింహా, జై సింహా, శ్రీరామ రాజ్యం వంటి సినిమాలు వచ్చాయి. అది అలా ఉంటే బాలయ్య రెమ్యూనరేషన్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.

అఖండ సినిమాకు ముందు (Balayya Babu) బాలయ్య రెమ్యూనరేషన్ 10 కోట్ల దగ్గరే వుండేదట. అయితే దాన్ని ఇప్పుడు డబుల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మరో విషయం ఏమంటే.. బాలయ్య రెమ్యూనిరేషన్ స్టయిల్ మిగితా హీరోలతో పోల్చితే కాస్తా భిన్నంగా ఉంటుంది. ఓ సినిమా ఒప్పుకునే ముందు ఏదో కొంత మొత్తం అనుకుంటారు. అయితే ఈ సినిమా విడుదల ముందు పరిస్థితి చూసి.. ఆ రెమ్యూనరేషన్‌ను తగ్గించడం కూడా జరుగుతుందట. ఆ విధంగా బాలయ్య నిర్మాతల శ్రేయస్సును కూడా ఆలోచిస్తారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus