Balakrishna: తనలా సింహంలా పుట్టాలంటున్న బాలయ్య.. రెడీ అంటున్న ట్రోలర్స్‌!

  • January 24, 2023 / 12:12 AM IST

బాలకృష్ణ సినిమాల్లో అనర్గళంగా డైలాగ్‌లు చెబుతారు కానీ.. బయట మాట్లాడమంటే మాత్రం ఇబ్బందిపడతారు. ఇదేం కొత్త విషయం కాదు.. గతంలో చాలాసార్లు జరిగింది. ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పేసి.. ఎవరినో అనాలని ఇంకెవరినో అనేస్తుంటారు. ఈ క్రమంలో కార్యక్రమానికి, వేదికకు సంబంధం లేని వాళ్ల పేర్లను కూడా ప్రస్తావిస్తుంటారు. పనిలోపనిగా ఒకరిద్దరిని తిడుతుంటారు, పంచ్‌ డైలాగ్‌లు వేస్తుంటారు. తాజాగా ఇలాంటి పనే చేసి.. ‘అక్కినేని’ ఫ్యాన్స్‌ను హర్ట్‌ చేశారు బాలయ్య.

‘వీరసింహుని విజయోత్సవం’ పేరుతో ‘వీర సింహా రెడ్డి’ చిత్రబృందం ఇటీవల హైదరాబాద్‌లో విజయోత్సవం నిర్వహించింది. ఈ వేదిక మీద బాలకృష్ణ 30 నిమిషాలకుపైగా మాట్లాడారు. సినిమాకు పని చేసిన వారి గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. పనిలో పనిగా తన గురించి, తన తండ్రి ఎన్టీఆర్‌ గొప్పతనం గురించి కూడా మాట్లాడారు. అయితే ఎన్టీఆర్‌కు సమానంగా ఇండస్ట్రీలో ఉన్న అక్కినేని గురించి తక్కువ చేసేలా మాట్లాడారు అని అభిమానులు, నెటిజన్లు అంటున్నారు.

స్టేజీ మీద ఉన్నవారి గురించో, ఇంకెవరి గురించో బాలయ్య మాట్లాడుతూ ‘‘ఈయన ఉన్నాడంటే సెట్‌లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఆ రంగారావు, ఈ రంగారావు… అక్కినేని.. తొక్కినేని…’ అంటూ మాటల్ని నమిలేశారు బాలయ్య. ఆయనేం చెప్పాలనుకున్నారో తెలియదు కానీ.. ఆయన అన్న మాటలు మాత్రం ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘అక్కినేని… తొక్కినేని’ అన్న పద ప్రయోగం ఎంతవరకు గౌరవప్రదం అనేది బాలయ్యనే చెప్పాలి. కార్యక్రమానికి ఏ మాత్రం సంబంధం లేని ఆయన పేరు ఎందుకు తెచ్చారో ఆయనే చెప్పాలి.

ఇప్పటికే బాలయ్య – నాగార్జున ఫ్యామిలీల మధ్య ఎవ్రీథింగ్‌ నాట్‌ ఓకే అనే పరిస్థితి ఉంది అంటుంటారు. ఇలాంటి సమయంలో బాలయ్య ఇలా అనడం ఎంతవరకు సబబు. అయితే బాలయ్య నోరు జారి ఇలా అన్నారు అనే చర్చ కూడా సాగుతోంది. మొన్నీమధ్యే ఏదో మాట అని, ఓ వర్గం మనోభావాల్ని దెబ్బ తీసి క్షమాపణ చెప్పారు బాలయ్య. ఇప్పుడు ఇలా అక్కినేని అభిమానుల మనోభావాల్ని దెబ్బతీశారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus