Balakrishna: నందమూరి బాలకృష్ణ చేతికి ఆపరేషన్.. డిశ్చార్జ్ ఎప్పుడంటే?

అవును నందమూరి బాలకృష్ణకి సర్జరీ జరిగింది.6 వారాల పాటు ఆయన విశ్రాంతి కూడా తీసుకోవాలట.వివరాల్లోకి వెళితే.. బాల‌కృష్ణ ఎడ‌మ భుజానికి ఆప‌రేష‌న్ జ‌రిగిందట. కొంతకాలంగా బాలయ్య భుజం నొప్పితో బాధ ప‌డుతున్నారు. అయితే నిన్న నొప్పి ఎక్కువ కావడంతో వైద్యులను సంప్రదించారు.హైద‌రాబాద్ లోని కేర్ ఆసుప‌త్రిలో బాలయ్య అడ్మిట్ అవ్వగా… డా.ర‌ఘువీర్ రెడ్డి గారి ఆధ్వ‌ర్యంలో బాల‌కృష్ణ‌కి శ‌స్త్ర చికిత్స జరిగినట్టు సమాచారం. మంగళవారం సాయంత్రం అంటే… ఈరోజు సాయంత్రం ఆయన్ని డిశ్చార్జ్ చేస్తారు.అభిమానులు కంగారు పడాల్సిన పనేమీ లేదు.

కచ్చితంగా బాలయ్య 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. గతంలో ‘పైసా వసూల్’ ‘జై సింహా’ వంటి సినిమాల సమయంలో ఓసారి బాలయ్య తన చేతికి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా… బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న ‘ఆఖండ’ షూటింగ్ టైం నుండీ బాల‌య్య‌కు భుజం నొప్పితో బాధపడుతున్నారట. అయితే షూటింగ్ కు అంతరాయం కలగకూడదని ఇన్ని రోజులు ఎదురుచూసినట్టు తెలుస్తుంది. ‘అఖండ’ షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది.

తాజాగా ఆహా వారికోసం ‘అన్ స్టాప‌బుల్’ అనే టాక్ షోలో కూడా బాలయ్య పాల్గొన్నారు. కొన్ని ఎపిసోడ్స్ కూడా ఆయన పూర్తి చేయడం జరిగిందట.మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు,మంచు లక్ష్మీ, విష్ణు మంచు లు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలయ్యింది. దీపావ‌ళి సంద‌ర్భంగా మొదటి ఎపిసోడ్ విడుద‌ల కానుంది.6 వారాలు పూర్తయ్యాక మిగిలిన ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్లో బాలయ్య పాల్గొంటారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus