Balayya Babu: బాలయ్య ఫ్లాప్ సినిమాలు రీ రిలీజ్ అవసరమా?

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ సింగ్ లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి… వంటి బాక్ టూ బాక్ హిట్లు అతని ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్ తో భగవంత కేసరి వంటి సినిమా చేస్తున్నాడు. అటు తర్వాత కూడా పెద్ద డైరెక్టర్ లతో, పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నారు. బాలయ్య గ్రాఫ్ ఇప్పుడు బాగా పెరిగింది. పారితోషికం పరంగా కూడా బాలయ్య రేంజ్ పెరిగింది.

గతంలో ఆయన పారితోషికం విషయంలో కానీ డైరెక్టర్ కొత్త, పాత వంటి విషయాలు కూడా బాలయ్య పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అభిమానుల కోసం అయినా బాలయ్య మారాల్సి వచ్చింది. బాలయ్య రీసెంట్ సినిమాలతో వాళ్లు హ్యాపీ, బాలయ్య కూడా హ్యాపీ. అతని కొత్త సినిమాల విషయంలో కూడా అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో బాలయ్య పాత సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు.అది కూడా బాలయ్య ఫ్లాప్ సినిమాలు.

అందులోనూ (Balayya Babu) బాలయ్య ని… భయంకరంగా ట్రోల్ అయ్యేలా చేసిన ఒక్క మగాడు, లయన్ వంటి సినిమాలు. ఈ సినిమాలు రీ రిలీజ్ అవ్వాలి అని అభిమానులు కూడా కోరుకోవడం లేదు. ఒకవేళ వాటిని రీ రిలీజ్ చేసినా , బాలయ్య అభిమానులు కూడా ఎక్కువగా థియేటర్ కి వెళ్ళి చూస్తారు అనే గ్యారంటీ లేదు.అందుకే సోషల్ మీడియాలో కూడా బాలయ్య ఫుల్ ఫాంలో ఉన్న టైమ్ లో ఆ ఫ్లాప్ సినిమాలను రీ రిలీజ్ చేయడం అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus