Veera Simha Reddy: వీర సింహారెడ్డి సక్సెస్… థియేటర్ల ముందు అభిమానుల హంగామా మామూలుగా లేదుగా!

అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు రావడం మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో బాలయ్య అభిమానులు థియేటర్ల ముందు చేస్తున్న హంగామా మామూలుగా లేదు.థియేటర్ల ముందు కటౌట్లకు పాలాభిషేకాలు చేయడమే కాకుండా మరికొందరు మద్యం రక్తంతో కూడా అభిషేకం చేస్తున్నారు.

ఇలా అభిమానులు వినూత్న రీతిలో బాలయ్య పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో తిరుపతిలో ఏకంగా ఓ థియేటర్ ముందు మేకపోతును బలి ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ ఎదురుగా బాలయ్య అభిమానులు మేకపోతును బలి ఇచ్చి ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేశారు.జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించడమే కాకుండా థియేటర్ ముందు మేకపోతును బలి చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై కొందరు స్పందిస్తూ ఒక సినిమా సక్సెస్ అయితే ఇలా మూగజీవాలను బలి చేయడం భావ్యం కాదంటూ మండిపడుతున్నారు. సాధారణంగా అమ్మవారికి మేకపోతును బలి ఇస్తేనే చాలామంది జంతువు ప్రేమికులు ఈ విషయంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇక సినిమా సక్సెస్ కావడంతో థియేటర్ ముందు ఇలా మేకపోతును బలి ఇవ్వడం జంతు ప్రేమికులకు ఆగ్రహం తెప్పిస్తుంది.

అయితే ఇలా సినిమాలో సక్సెస్ అయినప్పుడు జంతువులను బలి ఇవ్వడం ఇది మొదటిసారి కాదు ఇదివరకు ఎన్నోసార్లు అభిమానులు ఇలా థియేటర్ల ముందు జంతు బలిదానాలు ఇచ్చారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus