నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను..ల కాంబినేషన్లో ‘అఖండ’ వచ్చింది. అది మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు ‘అఖండ 2’ రాబోతుంది. సెప్టెంబర్ 25 నే ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ వి.ఎఫ్.ఎక్స్ పనులు వంటివి సకాలంలో పూర్తి కాకపోవడంతో వాయిదా వేసినట్టు ఇటీవల ప్రకటించారు. ఇదిలా ఉండగా..ఇటీవల బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ” ‘అఖండ 2’ చేశాం.
సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ లో రిలీజ్ అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కి వాయిదా వేశాం. ఆర్.ఆర్ కోసం తమన్ ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ‘అఖండ’ కి ‘అఖండ 2’ కి అతను 10 రెట్లు ఎఫర్ట్ పెడుతున్నాడు. దానికే(అఖండ) స్పీకర్లు పగిలిపోయాయి. ఇక ‘అఖండ 2’ కి ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నాం. అందువల్ల తెలుగులో మాత్రమే కాకుండా నార్త్ వంటి ఏరియాల్లో కూడా ఈ సినిమాని ఏకకాలంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. కుంభమేళాలో కూడా ‘అఖండ 2’ షూటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ కూడా సనాతన ధర్మం ఆధారంగా రూపొందిన సినిమానే. అయితే దర్శకుడు రత్నం కృష్ణ ఆ కాన్సెప్ట్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. దీంతో సినిమా పెద్ద ప్లాప్ గా మిగిలిపోయింది. ఇప్పుడు ‘అఖండ 2’ కూడా అలాంటి కాన్సెప్ట్ అని చెప్పడంతో కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మొదటి నుండి ఇది డివోషనల్ కాన్సెప్ట్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ అని అంతా భావించారు. అలాంటిది ఇప్పుడు సనాతన ధర్మం కాన్సెప్ట్ అని చెప్పడంతో.. ‘దర్శకుడు బోయపాటి హ్యాండిల్ చేయగలరా?’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డౌట్లకి ఒక క్లారిటీ రావాలంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.