నా శత్రువులు కూడా నాకు ఫోన్ చేశారు కానీ.. పవన్ పట్టించుకోలేదు: బండ్ల

“పవన్ కళ్యాణ్ నా దేవుడు” అని పబ్లిక్ గా ప్రకటించుకున్న ఏకైక నిర్మాత బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ తో “తీన్ మార్, గబ్బర్ సింగ్” వంటి చిత్రాలు నిర్మించి అవకాశం ఇస్తే మరో సినిమా నిర్మించడానికి రెడీగా ఉన్న బండ్ల గణేష్ కు ఇటీవల కరోనా వచ్చిన విషయం తెలిసిందే. ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకొన్న బండ్ల గణేష్ త్వరగానే కోలుకొని మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు. తన ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ పోలోమని ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలెట్టిన బండ్ల..

కొన్ని భీభత్సమైన స్టేట్ మెంట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో అనవసరంగా నటించానని మహేశ్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టిన బండ్ల ఇప్పుడు మరో సెన్సేషనల్ కామెంట్ చేశాడు. తనకు కరోనా వచ్చిందని జాలిపడి ఇండస్ట్రీలో అందరూ ఫోన్లు చేసి పరామర్శించారట. ఆఖరికి తాను భయపడే మోహన్ బాబు కూడా ఫోన్ చేసి మరీ ఎలా ఉన్నావ్ అని అడిగారు కానీ.. తాను దేవుడిగా పూజించే పవన్ కళ్యాణ్ మాత్రం ఫోన్ చేయలేదు,

కనీసం తన క్షేమ సమాచారాల గురించి వాకబు కూడా చేయలేదని బండ్ల బాధపడ్డారు. రాజకీయాల్లోకి వెళ్ళాక పవన్ తన ఆప్తమిత్రుడు అలీనే సరిగా పట్టించుకోలేదు. అలాంటిది బండ్లను పట్టించుకోకపోవడం పెద్ద విషయం ఏమిటి అని కొందరు వ్యాఖ్యానిస్తున్నప్పటికీ.. పవన్ వ్యవహారశైలిపై కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus