అవసరమైతే యాక్టింగ్ మానేస్తాను కానీ.. ఇకపై అలాంటి రోల్స్ మాత్రం చేయను

బండ్ల గణేష్ అంటేనే సెన్సేషన్. ఫామ్ లోని క్రికెటర్ ను కూడా జనాలు మర్చిపోతారు. కానీ.. ఫీల్డ్ లో లేకపోయినా బండ్ల గణేష్ ను మాత్రం జనాలు మర్చిపోలేదు. నటుడిగా, నిర్మాతగా కంటే స్టేజ్ మీద వ్యాఖ్యాతగా బండ్ల క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అలాంటిది. ఇప్పటికీ జనాలకు బోర్ కొడితే గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో బండ్ల గణేష్ స్పీచ్ చూస్తుంటారు. అంతటి పాపులర్ బండ్ల గణేష్ కు కరోనా రావడం, ఆయన ట్రీట్ మెంట్ తీసుకొని కోలుకోవడం కూడా జరిగిపోయాయి.

ఈ సందర్భంగా ఓ మీడియా హౌజ్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన బండ్ల గణేష్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు. అదేమిటంటే.. మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో నటించడం తాను చేసిన తప్పని, ఆ పాత్ర పోషించడం వల్ల తనకు ఒరిగిందేమి లేకపోగా.. స్నేహితులు, సన్నిహితులు “అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశావ్?” అని తిట్టారని ఆయన చెప్పుకొచ్చాడు. అవసరం అనుకుంటే నటనకు గుడ్ బై అయినా చెప్తాను కానీ..

ఇకపై అలాంటి సినిమాలు మాత్రం చేయను అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు బండ్ల. మరి బండ్ల అంత గట్టిగా ఎందుకు రియాక్ట్ అయ్యాడు అనేది తెలియాల్సి ఉండగా.. ఇప్పుడు బండ్ల కామెంట్ పై మహేశ్ ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus