Bandla Ganesh: ఆ పాప బాధ్యత తనదే అంటున్న బండ్ల గణేష్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా, ప్రొడ్యూసర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్ సేవా కార్యక్రమాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. డేగల బాబ్జీ సినిమాలో బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం బండ్ల గణేష్ ను అభిమానిస్తారు. వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా బండ్ల గణేష్ పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచినా తన మనస్సులో ఏదీ దాచుకోకుండా నిర్మొహమాటంగా బండ్ల గణేష్ చెబుతారని ఫ్యాన్స్ భావిస్తారు.

కరోనా సమయంలో సోషల్ మీడియా ద్వారా బండ్ల గణేష్ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నారు. తాజాగా బండ్ల గణేష్ నేపాలీ చిన్నారిని దత్తత తీసుకుని వార్తల్లో నిలిచారు. చాలామంది కుక్కలు, పిల్లులను పెంచుకుంటూ వాటికోసం చాలా డబ్బులను ఖర్చు చేస్తారని అయితే తాను మాత్రం పాపను పెంచుకొని ఆ పాపను గొప్పగా చదివించాలని భావిస్తున్నానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఆ పాప కూడా తమ ఇంట్లో మెంబర్ అయిపోయిందని ఆ పాప తమను బెదిరించే స్థాయికి వచ్చిందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

డేగల బాబ్జీ మూవీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఒకరోజు పాప ఏడుస్తుంటే వాళ్ల అమ్మ దగ్గర ఏమీ లేక పాలు మాత్రమే పట్టేదని నా భార్య మనం ఆ చిన్నారిని పెంచుకుందామని చెప్పడంతో పాపను దత్తత తీసుకున్నానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. నెటిజన్లు బండ్ల గణేష్ గ్రేట్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. డేగల బాబ్జీ రిలీజైన తర్వాత బండ్ల గణేష్ నటుడిగా మళ్లీ బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus