Bandla Ganesh, Prakash: ప్రకాశ్‌రాజ్ మీద ఈ పిట్టలదొర పంచ్‌లు ఎందుకో…

25/06/21… ఈ తేదీని బండ్ల గణేష్‌ మరచిపోవచ్చేమో కానీ, గూగుల్‌ మరచిపోదు. అందుకే ఇలా ‘సిని‘మా’ బిడ్డలం’ అని వెతగ్గానే… తొలి ప్రెస్‌ మీట్‌ జూన్‌ 25న అయ్యింది అంటూ కొన్ని ఫొటోలు చూపించింది. అయితే ఈ విషయం బండ్ల గణేశ్‌కు గుర్తులేదా? ఏమో రీసెంట్‌గా ఆయన మాటలు వింటుంటే ఇదే అనిపిస్తోంది. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ఫ్లోలో ఇటీవల జరిగిన మార్పులు మనకు తెలిసిందే. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుండి బయటకు వచ్చిన బండ్లన్న తాజాగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

ఈ క్రమంలో ఇటీవల ప్రకాశ్‌ రాజ్‌ ‘మా’ కళాకారులకు విందు నిర్వహించారు. అందులో కళాకారుల సమస్యల గురించి చర్చించాం అని చెప్పారు. అయితే సమావేశం సమయంలోనే బండ్ల గణేశ్‌ ఓ వీడియోను ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారాలు మొదలుపెట్టేశారు. ఇక అధ్యక్ష బరిలో ఉన్నవారు తమ గెలుపు కోసం ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రకాష్ రాజ్ ‘మా’ కళాకారులను విందుకి ఆహ్వానించారు.

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందు ప్రోగ్రామ్ ను బండ్ల గణేష్ తప్పుబట్టారు. విందులు, సన్మానాల పేర్లతో ‘మా’ కళాకారులందరికీ ఒక దగ్గరకు చేర్చొద్దని బండ్ల గణేశ్‌ అన్నారు. గత రెండేళ్లలో అందరూ కరోనా భయంతో బతుకుతున్నారు. చాలామంది ప్రాణం మీదకు కూడా వచ్చింది. ఓటు కావాలంటే ఫోన్ చేసి అడగాలి కానీ… విందుల పేరుతో ఒక చోట చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని బండ్ల గణేశ్‌ కోరారు.

దీనికి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ… అసోసియేషన్ ఎన్నికలన్నాక.. అందరితో చర్చించడాలు.. క్యాంపెయినింగ్ అనేవి సర్వసాధారణంగా జరుగుతుంటాయన్నారు. ఇక్కడ బండ్లన్న మరచిపోయిన విషయం ఏంటంటే… జూన్‌ 25న ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ ఇలానే ఓ పెద్ద ప్రెస్‌ మీట్‌ పెట్టింది. దానికి చాలామంది హాజరయ్యారు. మీడియాతో కలిపి వంద మందికిపైగానే అక్కడికి చేరారు. అప్పుడు కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అప్పుడు మీటింగ్‌కి వచ్చి… పెద్ద స్పీచ్‌లు ఇచ్చి, నీతి వాక్యాలు చెప్పిన బండ్లన్న… ఇప్పుడు ఇలా చెప్పడం ఏంటో…

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus