టాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బండ్ల గణేష్ కి రాజకీయాలు అచ్చి రాలేదనే చెప్పాలి. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయన ఇమేజ్ బాగా దెబ్బతింది. 2018 ఎన్నికల్లో బండ్ల గణేష్ ఏ స్థాయిలో రెచ్చిపోయారో అందరికీ తెలిసిందే. ఆయన చేష్టలకు దారుణంగా అవమానాలకు గురయ్యారు. బ్లేడ్ గణేష్ అంటూ నెటిజన్లు ఆయన్ని ట్రోల్ చేశారు. అయితే రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని అర్ధం చేసుకున్న ఆయన వెంటనే పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పేసి సినిమాలపై దృష్టి పెట్టారు.
కానీ మళ్లీ బండ్ల గణేష్ పొలిటికల్ ఎంట్రీపై తరచూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్న ప్రతీసారి బండ్ల వాటిని ఖండిస్తూనే ఉన్నారు. నెటిజన్ల కామెంట్స్ కి స్పందిస్తూ తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అయితే తాజాగా మరోసారి బండ్ల గణేష్ తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. దేశ వ్యాప్తంగా అసెంబ్లీ ఎలెక్షన్స్ ఫలితాలను వెల్లడిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎలెక్షన్స్ రిజల్ట్స్ బయటకొచ్చాయి.
మమతా బెనర్జీ పార్టీ దూసుకుపోతుండడంతో బండ్ల గణేష్ కంగ్రాట్స్ చెబుతూ ఓ ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు.. ఈ పార్టీలో చేరతావా..? అంటూ ఆయన్ని ప్రశ్నించారు. దానికి వెంటనే స్పందించిన బండ్ల గణేష్.. ‘నా జీవితంలో ఇక రాజకీయాలు అనేవి ఉండవు’ అంటూ తేల్చి చెప్పారు.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!