Degala Babji: ఆహాలో బండ్ల గణేష్ డేగల బాబ్జీ.. సపోర్ట్ కావాలంటున్న బండ్లన్న?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా, నిర్మాతగా కొనసాగిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించిన అనంతరం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇలా నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన మొదటిసారిగా హీరోగా డేగల బాబ్జీ అనే సినిమాలో నటించారు. ఇకపోతే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి అభిమానో మనకు తెలిసిందే.

ఈయన ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొస్తారు. ఏకంగా ఆయనని దేవర అంటూ ఎంతో అభిమానాన్ని చాటుకుంటారు.ఇలా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున హడావిడి చేయడమే కాకుండా ఆయన నటించిన జల్సా తమ్ముడు సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి అభిమానులను సందడి చేస్తున్నాయి. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలు తిరిగి విడుదల అవుతూ అభిమానులను సందడి చేయగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదిక చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తాను ప్రధాన పాత్రలో నటించిన డేగల బాబ్జీ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీ ఆహాలో ప్రసారం కానుందని తెలియజేస్తూ ఈ సినిమా ప్రయోగాత్మక చిత్రం ఒక వ్యక్తి ఒకే ప్లేస్ లో ఉంటూ సినిమా మొత్తాన్ని నడిపించారు. ఈ సినిమా సెప్టెంబర్ రెండవ తేదీ విడుదల కాబోతుందని తెలియజేస్తూ తన సినిమాకి మద్దతు తెలిపాలని తన సినిమాని ఆదరించాలని కోరారు.

ఇక ఈ సినిమా మే 20వ తేదీ విడుదల అయినప్పటికీ ఈ సినిమా విడుదలైన విషయం కూడా చాలామందికి తెలియదు అని చెప్పాలి. ఇలా మే 20న థియేటర్లో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ రెండవ తేదీ అహాలో ప్రసారం కానుంది. మరి ఈ సినిమాని అభిమానులు ఏ విధంగా ఆదరిస్తారో తెలియాల్సి ఉంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus