బండ్ల గణేశ్.. ఇలా అనేకంటే బ్లాక్‌బస్టర్ బండ్ల గణేశ్ అంటేనే బాగుంటుంది. ఎందుకంటే నిర్మాతగా ఆయన ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడు ఇలానే అనేవారంతా ఆయన్ను సినిమా పరిశ్రమలో. ఆయన సినిమా తీస్తున్నాడు అంటే సెట్స్‌లో ‘బ్లాక్‌బస్టర్ పక్కా’ అనే మాటలు రోజూ వినిపించేవట. అలాంటి బండ్ల గణేశ్ గత కొన్నేళ్లుగా కామ్‌గా ఉన్నారు. అయితే ఏమైందో ఏమో సడన్‌గా ‘దీపావళి సంబరాలు’ అంటూ ఓ ఈవెంట్ పెట్టాడు. దానికి సినిమా మన పరిశ్రమ నుండి 50 మందికిపైగా ప్రముఖ నటులు, నటులు వచ్చారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో దీని గురించే చర్చ నడుస్తోంది.
Bandla Ganesh
షాద్ నగర్‌లోని తన ఇంట్లో భారీ ఎత్తున దీపావళి విందు ఏర్పాటు చేశాడు బండ్ల గణేశ్. దానికి సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్‌తోపాటు స్టార్ డైరక్టర్‌లు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్.. యంగ్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా తదితరులు హాజరయ్యారు. దీంతో ఇంత భారీ ఈవెంట్ పెట్టడానికి కారణమేంటి? ఖర్చెంత? దాని వెనుక కథేంటి అంటూ రకరకాల చర్చలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఎందుకంటే మొత్తం పార్టీ ఖర్చు రూ.2 కోట్లు అయి ఉంటుందని ఓ అంచనా.
దీనికి కొందరు బండ్లన్న తిరిగి సినిమా నిర్మాణంలోకి రావాలని అనుకుంటున్నారు.. అందుకే ఈ మీట్ అని అంటుంటే.. మరికొందరు తన కొడుకుల్ని హీరోలుగా చేద్దాం అనుకుంటున్నారు అందుకే పరిచయ కార్యక్రమంలా ఇది పెట్టారు అని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఈవెంట్‌లో యువ హీరోల మీద బండ్ల తనదైన శైలిలో పొగడ్తలతో పంచ్‌లు విసిరాడట. ఇక ఖర్చు సంగతి చేస్తూ.. ఒక డిన్నర్ ప్లేట్ కాస్ట్ రూ.20 వేల వరకూ ఉందని టాక్. ఆ లెక్కన మొత్తం పార్టీకి రూ.2 కోట్లు అవ్వడం పెద్ద విషయం కాదు అని చెప్పొచ్చు. అయితే ఎందుకు చేశాడు అనేది ఆయనే ఏదో ఇంటర్వ్యూలో చెప్పేస్తాడు. సో వెయిట్ ఫర్ సమాచారం.