బండ్ల గణేష్(Bandla Ganesh) పరిచయం అవసరం లేని పేరు. కమెడియన్ గా పలు సినిమాల్లో నటించిన ఆయన తర్వాత నిర్మాతగా మారి ‘గబ్బర్ సింగ్’ ‘టెంపర్’ వంటి హిట్లు ఇచ్చారు. తర్వాత నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వచ్చినా.. పలు సినిమా ఈవెంట్లలో ఆయన వాక్ చాతుర్యంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బండ్ల గణేష్ స్పీచ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
కొందరు దర్శకనిర్మాతలు ఈయన్ని తమ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లకు గెస్ట్..లు గా ఆహ్వానించడానికి కారణం అదే. గతంలో ఈయన ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సినిమాలు నిర్మించేవారు. తర్వాత శివబాబు బండ్ల సమర్పణని జత చేశారు.
ఇప్పుడు మళ్ళీ బండ్ల గణేష్ సినిమాలు నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఆల్రెడీ తేజ సజ్జ,సిద్ధు జొన్నలగడ్డ వంటి హీరోలకు అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేసినట్టు టాక్. అయితే ఈసారి కొత్త బ్యానర్ ను స్థాపించి సినిమాలు నిర్మించేందుకు బండ్ల గణేష్ రెడీ అయ్యారు. ఆ బ్యానర్ పేరు ‘బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్’. ఇదే పేరు పై 2026 కొత్త సినిమాని అనౌన్స్ చేయబోతున్నారు అని టాక్. సడన్ గా ఇప్పుడు బ్యానర్ పేరు ఎందుకు మార్చినట్టు అనే డౌట్ అందరికీ కలిగింది.
నిర్మాణ రంగానికి గ్యాప్ ఇవ్వడంతో.. ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్ ను అంతా మర్చిపోవడం వల్ల.. బండ్ల గణేష్ ఇలా బ్యానర్ పేరు మార్చినట్టు అంతా చెప్పుకుంటున్నారు. కానీ ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్ పై చాలా కేసులు ఉన్నాయి. బండ్ల గణేష్ చాలా మందికి ఫైనాన్స్ ఎగ్గొట్టినట్టు టాక్ ఉంది. ఇప్పుడు ఆ బ్యానర్ పై కొత్త సినిమా స్టార్ట్ చేస్తే.. ఫైనాన్షియర్స్ అంతా కోర్టుకెక్కే అవకాశం ఉంది.
ఇటీవల ‘అఖండ 2’ నిర్మాతలకు అలాంటి విషయాలలోనే చాలా సమస్యలు వచ్చి పడ్డాయి. అందుకే బండ్ల గణేష్ తెలివిగా కొత్త బ్యానర్ ను రిజిస్టర్ చేసి.. సినిమాలు నిర్మించాలని డిసైడ్ అయినట్టు స్పష్టమవుతుంది.