Bandla Ganesh, Prakash Raj: ప్రకాష్ రాజ్ కి షాకిచ్చిన బండ్ల గణేష్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ‘సినిమా బిడ్డలు’ ప్యానల్ నుంచి అధ్యక్షపదవికి పోటీ పడుతున్న నటుడు ప్రకాష్ రాజ్ కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ షాకిచ్చారు. ప్రకాష్ రాజ్ తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించలేనంటూ చేతులెత్తేశారు. ఈ మేరకు బండ్ల గణేష్ ఓ ట్వీట్ చేశారు. తనను అధికార ప్రతినిధిగా ఎన్నుకున్నందుకు ప్రకాష్ రాజ్ కు ధన్యవాదాలు చెబుతూ.. వ్యక్తిగత కారణాల వలన ఆ పదవిని నిర్వర్తించలేనని చెప్పారు.

దయచేసి ఆ పదవికి వేరే వ్యక్తిని ఎన్నుకోమని సూచించారు. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 2న ప్రకాష్ రాజ్ తన ‘సినిమా బిడ్డలు’ ప్యానెల్ ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. తన ప్యానల్ లో ఉన్న వారందరితో మీడియా సమావేశం నిర్వహిస్తామని.. అప్పుడే ‘మా’ ఎన్నికల కోసం ఎజెండా, ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు.

అప్పటివరకు మీడియాతో తమ ప్యానెల్ తరఫున ప్రతినిధులుగా జయసుధ , బండ్ల గణేష్, సాయి కుమార్ మాత్రమే మాట్లాడతారని ప్రకాష్ రాజ్ చెప్పారు. అయితే ప్రకాష్ రాజ్ ప్రకటించిన ప్యానెల్ లో ఎక్కడా కూడా బండ్ల గణేష్ పేరు కనిపించలేదు. దీంతో ఆయన హర్ట్ అయినట్లు తెలుస్తోంది. అందుకే అధికార ప్రతినిధిగా ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.


Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus