ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎంతో సంతోషిస్తున్నారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బండ్ల గణేష్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తానని చెప్పుకొచ్చారు.
విద్యార్థి నాయకుడి నుంచి తెలంగాణ సీఎంగా రేవంత్ ఎదిగిన తీరు సినిమా స్టోరీకి ఏ మాత్రం తక్కువ కాదని ఆయన అన్నారు. ఈ కారణాల వల్లే ఆయన కథను సినిమాగా చేయాలని అనుకుంటున్నానని బండ్ల గణేష్ వెల్లడించడం గమనార్హం. మరి బండ్ల గణేష్ నిజంగానే ఈ బయోపిక్ ను నిర్మిస్తారేమో చూడాలి. బండ్ల గణేష్ నిర్మాతగా మళ్లీ యాక్టివ్ అయ్యి వరుసగా సినిమాలను నిర్మించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రాబోయే రోజుల్లో బండ్ల గణేష్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. బండ్ల గణేష్ సినీ నిర్మాణంపై దృష్టి పెడితే ఆయన కెరీర్ మరింత పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఆరు గ్యారంటీల దస్త్రంపై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు.
దివ్యాంగురాలు రజినీ ఉద్యోగ నియామక ఉత్తర్వుపై (Revanth Reddy) రేవంత్ రెడ్డి రెండో సంతకం చేశారు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకోనున్నారు. రేవంత్ కేబినేట్ లో ఖమ్మం జిల్లా నుంచి ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!