Bandla Ganesh: ఇరగ దెం**రు అన్నావ్.. చివర్లో గాలి తీసేశావ్ .. ఏంటి బండ్ల ఇది..!

బండ్ల గణేష్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ఇతను కమెడియన్ గా, సహాయ నటుడిగా యాక్ట్ చేశాడు. నిర్మాతగా మారి పలు హిట్టు సినిమాలు తీశాడు. అయినా జనాలు ఇతన్ని గుర్తు పెట్టుకుంటున్నారు, ఇంకా ఇతనికి హై ఇస్తున్నారు అంటే ఒక్కటే.. కారణం, అది ఇతను ఇచ్చే స్పీచ్ ల వల్ల. ఇతను ఏ సినిమా వేడుకలో మైక్ పట్టుకున్నా.. ఆ రోజు మీమర్స్ కు పండగే అని చెప్పాలి.ఇతను ఇచ్చే స్పీచ్ అగ్రెసివ్ గా ఉంటుంది.

కొన్ని చోట్ల లాజిక్ లెస్ అనిపిస్తుంది. మొన్నామధ్య పూరి జగన్నాథ్ కొడుకు సినిమా వేడుకకు వెళ్ళి.. పూరి ఫ్యామిలీ మేటర్స్ ను బహిరంగం చేసేశాడు. అందుకు పూరి పరోక్షంగా కౌంటర్ ఇచ్చినా తర్వాత సైలెంట్ అయిపోయాడు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. తాజాగా ఇతను ధమాకా సక్సెస్ మీట్ కు వచ్చాడు. ఇతన్ని నిర్మాతను చేసింది రవితేజ కాబట్టి.. పైగా చాలా కాలంగా ఇతని ఫ్రెండ్ కాబట్టి.. ఓ రేంజ్ లో డబ్బా కొట్టేశాడు.

అందులో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి కాబట్టి.. రవితేజ ఫ్యాన్స్ హ్యాపీ. కాకపోతే స్పీచ్ చివర్లో.. దర్శకుడు త్రినాథ్ రావ్ గురించి మాట్లాడుతూ.. ఇరగ దెం**రు సార్ సినిమాని అంటూ ఓ బూతు తో పొగిడాడు. ఆ వెంటనే నిర్మాత గురించి మాట్లాడుతూ.. ‘ మీరు ఈ సినిమాని రవితేజతో కాకుండా వేరే హీరోతో చేసి ఉంటే ఒక్కరోజు మాత్రమే ఆడేది.

ఇది ఒక్కరోజు ఒక్క ఆట సినిమా ‘ అని గాలి తీసేసాడు. అప్పుడు ముందు దర్శకుడిని పొగిడింది ఎందుకు అంటూ సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.దీంతో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు బండ్ల.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus