Bangarraaju Movie: బంగార్రాజు మూవీ స్టోరీ లైన్ ఇదే?

నాగార్జున, నాగచైతన్య కీలక పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో బంగార్రాజు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెలా..? లేక ప్రీక్వెలా..? అనే ప్రశ్నకు సమాధానం తెలియక అక్కినేని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం బంగార్రాజు సోగ్గాడే చిన్నినాయనకు సీక్వెల్ కాగా బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని సమాచారం. నాగచైతన్యకు అన్నీ తాత బుద్ధులే వస్తాయని మనవడిని సరైన దారిలో పెట్టాలనే ఉద్దేశంతో స్వర్గం నుంచి బంగార్రాజు భూమిపైకి వస్తాడని సమాచారం.

నిజ జీవితంలో నాగార్జున, నాగచైతన్య తండ్రీకొడుకు కాగా సినిమాలో మాత్రం తాతామనవడిగా కనిపించనున్నారు. మనం సినిమాలో నాగచైతన్య, నాగార్జున తండ్రీకొడుకులుగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని హక్కులను జీ ఛానల్ నిర్వాహకులు 47 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. సోగ్గాడే చిన్నినాయన 2016 సంవత్సరంలో 50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించిన నేపథ్యంలో జీ ఛానల్ నిర్వాహకులు భారీ మొత్తానికి బంగార్రాజు మూవీ డీల్ కుదుర్చుకున్నారని సమాచారం.

ఈ సినిమాతో నాగార్జునకు రెమ్యునరేషన్లు కాకుండా కనీసం పది కోట్ల రూపాయల లాభం ఉంటుందని తెలుస్తోంది. అయితే రమ్యకృష్ణ ఈ సినిమాలో నటిస్తున్నారో లేదో తెలియాల్సి ఉంది. నాగచైతన్యకు జోడీగా ఈ మూవీలో కృతిశెట్టి నటిస్తున్నారు. సంక్రాంతికి పోటీ బాగానే ఉన్నా నాగార్జున మాత్రం పోటీ విషయంలో వెనక్కు తగ్గరని తెలుస్తోంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు పండుగ సీజన్ లోనే మంచి కలెక్షన్లను వస్తాయి. బంగార్రాజు మూవీ కోసం కళ్యాణ్ కృష్ణ తయారు చేసిన స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని సమాచారం

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus